WTC Final 2023 : టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో ట్రావిస్ హెడ్(100 : నాటౌట్ 106 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్స్) సెంచరీ కొట్టాడు. అటాకింగ్ గేమ్ ఆడుతున్నఅతను షమీ ఓవర్లో సింగిల్ తీసి అతను శతకం సాధించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో మూడంకెల్ స్కోర్ చేసిన తొలి ఆటగాడిగా హెడ్ రికార్డు సృష్టించాడు.
టెస్టుల్లో అతడికి ఇది ఆరో సెంచరీ.
మూడో సెషన్లో మరింత దూకుడు పెంచిన హెడ్ ఆసీస్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. మరోవైపు క్రీజులో పాతుకుపోయిన స్టీవ్ స్మిత్(53 నాటౌట్) కూడా అర్ధ శతకం బాదాడు. వీళ్లిద్దరూ నాలుగో వికెట్కు రికార్డు స్థాయిలో 161 పరుగులు జోడించారు. 65 ఓవర్లకు స్కోర్.. 238/3.
The first centurion in World Test Championship Final history 🥇
Take a bow, Travis Head 👏
Follow the #WTC23 Final 👉 https://t.co/wJHUyVnX0r pic.twitter.com/PFyd7UzcZX
— ICC (@ICC) June 7, 2023