e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home News తేలికపాటి బుల్లెట్‌ఫ్రూఫ్‌ జాకెట్లు

తేలికపాటి బుల్లెట్‌ఫ్రూఫ్‌ జాకెట్లు


అభివృద్ధి చేసిన డీఆర్డీవో కాన్పూర్‌ సెంటర్


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 1 (నమస్తే తెలంగాణ): యుద్ధక్షేత్రంలో ముందుండి పోరాడే సైనికుల రక్షణ కోసం వాడే బుల్లెట్‌ఫ్రూఫ్‌ జాకెట్‌ (బీపీజే)ను తక్కువ బరువుతో డీఆర్డీవోకు చెందిన డిఫెన్స్‌ మెటీరియల్స్‌ అండ్‌ స్టోర్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (డీఎంఎస్‌ఆర్‌డీఈ) కాన్పూర్‌ రూపొందించింది. గతంలో బీపీజే బరువు 10.4 కేజీలు ఉండగా.. కొత్త వాటి బరువు 9 కేజీలే. సాయుధ సిబ్బందికి బరువు తగ్గడంతోపాటు సౌకర్యంగా ఈ బీపీజేలు ఉండనున్నాయి. పూర్తి జాగ్రత్తలతో ఎక్కడా నాణ్యతా లోపాలు లేకుండా రూపొందించిన బుల్లెట్‌ఫ్రూఫ్‌ జాకెట్లను చండీగఢ్‌లోని టెర్మినల్‌ బాల్లిస్టిక్స్‌ రీసెర్చ్‌ ల్యాబోరేటరీ(టీబీఆర్‌ఎల్‌)లో పరీక్షించగా బీఐస్‌ స్టాండర్డ్స్‌కు తగ్గట్టు ఉన్నదని డీఆర్డీవో అధికారులు తెలిపారు. తక్కువ బరువు బీపీజేలను రూపొందించిన సిబ్బందిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, డీఆర్డీవో ఆర్‌అండ్‌డీ విభాగం చైర్మన్‌ డాక్టర్‌ జీ సతీశ్‌రెడ్డి అభినందించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తేలికపాటి బుల్లెట్‌ఫ్రూఫ్‌ జాకెట్లు

ట్రెండింగ్‌

Advertisement