న్యూఢిల్లీ: విజయ దేవరకొండ నటిస్తున్న లైగర్ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 22వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ముంబైలో ఛాయ్‌వాలాగా ఉన్న దేవరకొండ.. ఆ తర్వాత లాస్ వెగాస్‌లో ఎలా లైగర్‌గా గర్జించాడో టీజర్లో చూపించారు. స్లమ్‌డాగ్, ఛాయ్‌వాలా అంటూ విజయ్ ఎంట్రీని ప్రజెంట్ చేశారు. ఇక అమెరికాలో జరిగే ఎంఎంఏ పోటీల్లో లైగర్ విజయ్‌దేవరకొండ తన స్టంట్స్‌తో అలరించాడు. రింగ్‌లో ఎలా లైగర్ సత్తా చాటాడో ఇక సినిమాలో చూడాల్సిందే. విజయ్‌కు ట్రైనర్ పాత్రలో రోనిత్ రాయ్ నటించాడు. ఈ ఫిల్మ్ లో ప్రపంచ దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. అనన్య పాండే హీరోయిన్ రోల్ ప్లే చేస్తోంది. కరణ్ జోహార్, చార్మీ కౌర్ , అపూర్వ మెహతా, హీరూ యాష్ జోహార్లు ఈ ఫిల్మ్‌కు ప్రోడ్యూసర్లుగా ఉన్నారు.