న్యూఢిల్లీ, నవంబర్ 26: టెలికం కంపెనీ బీఎస్ఎన్ఎల్.. లైఫ్‌టైమ్ ప్రీ-పెయిడ్ ప్లాన్స్‌కు స్వస్తిచెప్పింది. లైఫ్‌టైమ్ ప్లాన్స్‌తో వినియోగదారులకు తక్కువ టారీఫ్తో ప్రయోజనాలు అందేవి. ప్రస్తుతం ఈ ప్లాన్స్ కలిగిన కస్టమర్లను రూ.107 ప్లాన్‌లోకి బీఎస్ఎన్ఎల్ మార్చనున్నది. ఈ మార్పు డిసెంబర్ 1 నుంచి అమలులోకి వస్తుంది. రూ.107 ప్లాన్.. 90 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ ఇన్కమింగ్ కాల్స్ లభిస్తాయి. ఈ ప్లాన్‌తో వచ్చే 10 జీబీ డేటా 30 రోజులు అందుబాటులో ఉంటుంది. 24 రోజులు 100 నిమిషాల అవుట్గోయింగ్ కాల్స్ చేసుకోవచ్చు. కానీ రూ.107 ప్లాన్‌లో సాధారణంగా ఇచ్చే ఉచిత సర్వీసులు… లైఫ్‌టైమ్ ప్లాన్స్ ద్వారా బదిలీ అయ్యే ఖాతాదారులకు లభించవు. మరోవైపు బీఎస్ఎన్ఎల్ రూ.2,399 వార్షిక ప్రీ-పెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీని మరో 60 రోజులు పొడిగించింది. వ్యాలిడిటీ 425 రోజులకు పెరుగుతుంది.