కేంద్ర ప్రభుత్వం మార్చిలోగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) పబ్లిక్ ఇష్యూను జారీ చేయబోతున్నది. ఈ నేపథ్యంలో ఎల్ఐసీ పాలసీ తీసుకున్నవారంతా డీమ్యాట్ అకౌంట్ తెరవాలని సంస్థ ఇప్పటికే కోరింది. చాలాకాలంగా ఎల్ఐసీ పాలసీని కలిగి ఉన్నవారందరికీ డిస్కౌంట్ ధరకే షేర్లను తప్పనిసరిగా కేటాయించేందుకు ఈ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)లో కొంత భాగాన్ని రిజర్వ్ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది మరి. బీమా రంగంలో దేశంలోనే అతిపెద్ద సంస్థ ఎల్ఐసీ. వ్యాపార పరంగానూ, పాలసీదారుల సంఖ్యలోనూ దీనికి దగ్గరగా ఏ కంపెనీలు లేవు. ఇప్పటికే ప్రభుత్వ రంగంలోని జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు వచ్చాయి. ఈ క్రమంలో ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూకు సైతం ఒక్కటొక్కటిగా ఆటంకాలు తొలగిపోయాయి. మిగతా బీమా కంపెనీలకన్నా వాల్యూయేషన్లు చాలా ఆకర్షణీయంగా ఉన్నందున ఎల్ఐసీ షేర్.. ఇండెక్స్లలో కూడా చేరే అవకాశాలున్నాయి.