హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): ఆర్మూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మధ్య ఆసక్తికరణ సంభాషణ జరిగింది. సీఎల్పీ కార్యాలయంలో శనివారం ఈ ఇద్దరు నేతలు ఎదురుపడ్డారు. ‘జీవన్.. మా గురించి చాలా మాట్లాడుతున్నావు ఏంటి..?’ అని రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. దీనికి జీవన్‌రెడ్డి ‘అవును మా బాస్‌ను ఒక్క మాట అంటే వంద మాటలంటాం.. బరాబర్‌గా అంటాం’ అని చెప్పారు. దానికి రాజగోపాల్‌రెడ్డి ‘నేను సీఎం కేసీఆర్‌ను ఏం అనలేదు.. మీడియా మిత్రులు కేసీఆర్‌కు హెల్త్ బాగోలేదని చెబితే, ఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాలు చూసి ఏమో’ అని మాత్రమే అన్నానని చెప్పారు. తెలంగాణలో ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ అధికారంలోకి రాదని, మరో 20 ఏండ్లు టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని చెప్పారు. అనంతరం ఇద్దరు నేతలు ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.