ఇంకా చెదరనివ్వని పెదవులపై
నవ్వులు విరబూయనేలేదు
పల్లవి చరణం పాడనేలేదు
మనసులోని ధైర్యానికి
వెన్నెల రెక్కలను తొడగనేలేదు
వాకిలి తలుపులు తెరవనేలేదు
నిన్న మొన్నటి కలల
భయాందోళన చీకట్లు వీడనేలేదు
వెలుగు తెరలు తెరుచుకోనేలేదు
బతుకు భరోసా నీడలు
వలస దుఃఖప్రయాణం
గమ్యం చేరనే లేదు
గుండె గుడిసే దీపం
వెలిగించనేలేదు
మృత్యువాత రాతలు చెరిపే
మరలా అంతకంతకూ వేగంగా
ప్రపంచాన్ని చాపకింద నీరులా
కరోనా వైరస్ మహమ్మారి
‘ఒమిక్రాన్’ రూపంలో దూసుకొస్తున్నది
ఇగ ప్రతి రోజూ
మాస్కులతో భౌతికదూరం పాటిస్తూ
శానిటైజర్, హ్యాండ్‌వాష్‌లతో
ముందు జాగ్రత్తలతో
అప్రమత్తంగా ఉందాం
ఒమిక్రాన్‌ను ఓడిద్దాం…!
-పగిడిపల్లి సురేందర్ పూసల ,80748 46063