Newzealand Cricket : టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో కంగుతిన్న న్యూజిలాండ్ (Newzealand) ఏప్రిల్ నెలలో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. సీనియర్లలో చాలామంది ఐపీఎల్ కోసం భారత్‌లో ఉన్నందున.. పలువురు జూనియర్లకు అవకాశమిచ్చారు సెలెక్టర్లు. అనుభవజ్ఞుడైన టామ్ లాథమ్ (Tom Latham)కు వన్డే, టీ20 కెప్టెన్సీ అప్పగిస్తూ.. మంగళవారంన్యూజిలాడ్ క్రికెట్ స్క్వాడ్‌ను ప్రకటించింది. వరల్డ్‌కప్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్, స్వ్వాడ్లోని రచిన్ రవీంద్ర, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్.. వంటి కీలక ఆటగాళ్లపై వేటు పడింది.
ఆశ్చర్యంగా బంగ్లాదేశ్ పర్యటనకు ఎంపికైన వారిలో సీనియర్లే లేరు. ఇటీవలే పొట్టి ప్రపంచకప్ ఆడిన చాలామంది ఐపీఎల్‌తో బిజీగా ఉన్నందున యువకులకు పట్టం కట్టారు. కొన్ని రోజులకు జట్టుకు దూరమైన పేసర్లు మ్యాట్ ఫిషెర్, విల్ ఓ రూర్కీ, బ్లెయిర్ టిక్నర్లకు స్క్వాడ్‌లో చోటు దక్కింది.
New Zealand have named their squads for the white-ball tour of Bangladesh in April 🇳🇿
🫡 Tom Latham to lead both squads
⚡️ O’Rourke, Tickner, Fisher return from injuries
🔙 Foxcroft called up for first time since April 2024 pic.twitter.com/7c8momYgb7— ESPNcricinfo (@ESPNcricinfo) March 31, 2026
ఏప్రిల్ నెలలో న్యూజిలాండ్ జట్టు వైట్ బాల్ సిరీస్ కోసం బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. టామ్ లాథమ్ సారథ్యంలోని కివీస్ ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఏప్రిల్ 17న తొలి వన్డేతో సిరీస్ మొదలవ్వనుంది. ఏప్రిల్ 27న పొట్టి సిరీస్‌లో ఇరుజట్లు తలపడనున్నాయి. ఢాకా, చత్తోగ్రామ్ స్టేడియాల్లో వన్డే, టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి.
న్యూజిలాండ్ వన్డే స్క్వాడ్ : టామ్ లాథమ్(కెప్టెన్), ముహమ్మద్ అబ్బాస్, క్రిస్టియన్ క్లార్కే, జోష్ క్లార్క్సన్, డానే క్లీవర్, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, నిక్ కెల్లీ, జైడెన్ లెనాక్స్, విల్ ఓ రూర్కీ, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, బ్లెయిర్ టక్నర్, విల్ యంగ్.
న్యూజిలాండ్ టీ20 స్క్వాడ్ : టామ్ లాథమ్(కెప్టెన్), మ్యాట్ ఫిషెర్, టిమ్ రాబిన్సన్, కటెనె క్లార్కే, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, బెన్ సియర్స్, క్రిస్టియన్ క్లార్కే, బెవిన్ జాకబ్స్, నాథన్ స్మిత్, జోష్ క్లార్క్సన్, నిక్ కెల్లీ, ఇష్ సోధీ, డానే క్లీవర్, జైడెన్ లెనాక్స్, బ్లెయిర్ టిక్నర్.