KTR | ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువే : కేటీఆర్
తెలంగాణలో వచ్చింది ప్రకృతి కరువు కాదు.. రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
హైదరాబాద్ : తెలంగాణలో వచ్చింది ప్రకృతి కరువు కాదు.. రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో నిర్మల్ జిల్లాకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు కేటీఆర్ సమక్షంలో భారీగా చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో కరువు పరిస్థితులకు రేవంత్ రెడ్డిదే బాధ్యత అన్నారు.
గోదావరి, కృష్ణా నదుల్లో నీళ్లు పారుతున్నా.. తెలంగాణ పొలాలు ఎండిపోవడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే.. అందుబాటులో ఉన్న నీటిని ఎత్తిపోయకుండా వృథాగా సముద్రంలోకి వదిలేశారని విమర్శించారు. కన్నెపల్లి పంప్‌హౌస్‌లో మోటర్లు ఆన్ చేసి ఉంటే రైతులకు సాగునీరు అందేది. రేవంత్ రెడ్డి ఆ పని చేయలేదన్నారు. కాళేశ్వరం మోటర్లు ఆన్ చేయకపోవడం వల్లే గోదావరి జలాలను వినియోగించుకోలేకపోయాం.
రైతుల పంటలు కాపాడటం కంటే కేసీఆర్‌కు పేరు వస్తుందనే భయమే రేవంత్ రెడ్డికి ఎక్కువైందన్నారు. కాళేశ్వరం పంపులు ఆన్ చేస్తే కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు ఉపయోగపడుతుందని ఒప్పుకోవాల్సి వస్తుందనే రాజకీయ కక్షతోనే రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. గోదావరి నుంచి 750 టీఎంసీలు.. కృష్ణా నుంచి 250 టీఎంసీలు! రాష్ట్రానికి ఉపయోగపడాల్సిన వెయ్యి టీఎంసీల నీటిని వినియోగించుకోలేని అసమర్దత కాంగ్రెస్ ప్రభుత్వానిది. వెయ్యి టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకుంటే తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉండేదని పేర్కొన్నారు.
ఆంధ్రాలో పొలాల్లోకి.. తెలంగాణలో సముద్రంలోకి
వాతావరణ హెచ్చరికలు ముందే ఉన్నా.. నీటి నిల్వలు పెంచుకునే చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించక పోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. రైతుబంధు లేదు, సకాలంలో కరెంటు లేదు, యూరియా లేదు, సాగునీరు లేదు రైతులను ఇన్ని కష్టాల్లోకి నెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. పంటలను కాపాడుకోవడానికి రైతులు ట్యాంకర్లతో నీళ్లు తెచ్చుకుంటున్నా.. గొర్రెలు, మేకలు అమ్ముకుంటున్నా ప్రభుత్వానికి చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటిని మళ్లించుకుని ఉపయోగించుకుంటుంటే తెలంగాణలో మాత్రం నదుల నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ విమర్శలు పక్కనపెట్టి.. రైతులకు నీళ్లు ఇవ్వడమే రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రాధాన్యత కావాలన్నారు. తెలంగాణ రైతుల పంటలను కాపాడాలంటే వెంటనే సాగునీటి ప్రాజెక్టుల పంపులు నడపాలని సూచించారు. కరువును ముందే అంచనా వేసి నీటిని నిల్వ చేసుకోవాల్సింది పోయి.. ఇప్పుడు రైతులను ఇబ్బందుల్లోకి నెట్టడం కాంగ్రెస్ పాలనా వైఫల్యం అన్నారు. తెలంగాణ రైతాంగాన్ని కరువు కోరల్లోకి నెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులే తగు సమాధానం చెబుతారన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువే : కేటీఆర్
NZvIND: ఇండియా టార్గెట్ 199
Mrunal Thakur | రష్మిక పాత్ర కోసం వెళ్లి సీతగా.. ‘సీతారామం’ చిత్రంలో మృణాల్ ఠాకూర్ ఎంపిక వెనుక అసలు కథ ఇదే.!
Sigma | ఓటీటీలోకి విజయ్ కొడుకు తొలి సినిమా.. సందీప్ కిషన్ ‘సిగ్మా’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
India-A Vs New Zealand-A: డ్రాగా ముగిసిన ఇండియా-ఏ, న్యూజిలాండ్-ఏ మ్యాచ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

