రాయగఢ్‌లో విరిగిపడిన కొండచరియలు.. 30 మంది గల్లంతు!
కొండచరియలు| భారీ వర్షాలతో మహారాష్ట్ర వణికిపోతున్నది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో రాయగఢ్ జిల్లా మహడ్ తలైలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో శిథిలాల కింద సుమారు 300 మందికిపైగా చిక్కుకున్నట్లు సమాచారం.

ముంబై: భారీ వర్షాలతో మహారాష్ట్ర వణికిపోతున్నది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో రాయగఢ్ జిల్లా మహడ్ తలైలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో శిథిలాల కింద సుమారు 30 మందికిపైగా చిక్కుకున్నట్లు సమాచారం. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించామని రాయ్‌గఢ్ జిల్లా కలెక్టర్ తెలిపారు. అయితే భారీ వర్షాల కారణంగా ఆ ప్రాంతమంతా నీటమునగడంతో ఘటనా స్థలానికి చేరుకోలేకపోతున్నామని వెల్లడించారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని కోరినట్లు రాయ్‌గఢ్ ఇన్చార్జి మంత్రి అతిథి తట్కారే తెలిపారు. కొండచరియల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి ఆర్మీ, నేవీ బృందాలను పంపించాలని కోరినట్లు చెప్పారు. వరదల వల్ల రోడ్లు కొట్టుకుపోవడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని వెల్లడించారు.
కాగా, గురువారం రాత్రి భారీ వర్షాలు కురియడంతో ఛిఖ్లీ గ్రామం పూర్తిగా నిటమునింది. దీంతో అధికారులు గ్రామస్తులను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. పుణేలోని భీమ్శంకర్లోని భీమశంకర్ ఆలయం పూర్తిగా నీటమునింది. భారీ వర్షాల కారణంగా ఆలయంలో నుంచి వరద ప్రవహిస్తున్నది. మరోవైపు, కేరళలోని ఎర్నాకుళం, ఇడుక్కి, వయనాడ్‌లో శుక్రవారం అతి భారీ వర్షాలు కురవొచ్చని అధికారులు హెచ్చరికలు జారీచేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jana Chaitanya Sabha | జన చైతన్య సభను జయప్రదం చేయాలి : బీఆర్ఎస్ నాయకుల పిలుపు
Crime News | హంతకుడిని పట్టించిన బంగారు ఉంగరం.. ఎలాగంటే..!
Mahesh Bigala | ఐక్యంగా దీక్షా దివస్‌ను నిర్వహించాలి.. బీఆర్ఎస్ ఎన్నారై ప్రతినిధులకు మహేశ్ బిగాల పిలుపు
OTTReleases | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లివే!
ACB Raid | చేయూత పింఛన్ కోసం లంచం డిమాండ్.. రూ.10 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కార్యదర్శి
ట్రెండింగ్ వార్తలు
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video

