హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని ఇందిరమ్మ టవర్స్ భూసేకరణ వ్యవహారం మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. సర్వే నంబర్ 255/1లో రైతుల భూముల వద్ద ప్రహరీ నిర్మాణానికి రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేయడంతో పరిసర ప్రాంతాల్లో ఉత్కంఠ నెలకొంది
రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని ఇందిరమ్మ టవర్స్ భూసేకరణ వ్యవహారం మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. సర్వే నంబర్ 255/1లో రైతుల భూముల వద్ద ప్రహరీ నిర్మాణానికి రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేయడంతో పరిసర ప్రాంతాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆధ్వర్యంలో అధికారులు భూసేకరణకు సన్నద్ధమయ్యారు. ముందస్తు చర్యల్లో భాగంగా భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
గతంలో భూసేకరణకు వచ్చిన అధికారులు, పోలీసులను స్థానిక రైతులు వెనక్కి పంపిన నేపథ్యంలో ఈసారి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. భూములకు సంబంధించిన వివాదం నేపథ్యంలో సుమారు 20 మంది బాధిత రైతులతోపాటు బీఆర్ఎస్, బీజేపీ నేతలను హౌస్ అరెస్టు చేసినట్లు సమాచారం. పోలీసుల పహారాలో భూసేకరణ ప్రక్రియకు అధికారులు సిద్ధమవడంతో ఏం జరగనుందనే ఉత్కంఠ నెలకొంది.
హయత్‌నగర్‌లో ఇందిరమ్మ టవర్స్ భూసేకరణతో ఉద్రిక్త పరిస్థితులు
255 సర్వే నంబర్లో భూసేకరణకు అధికారుల ఏర్పాట్లు
భారీగా మోహరించిన పోలీసులు
ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆధ్వర్యంలో భూసేకరణ
గతంలో భూసేకరణకు వచ్చిన పోలీసులను, అధికారులను వెనక్కి పంపిన స్థానిక రైతులు
గత పరిణామాల నేపథ్యంలో ఈసారి భారీ పోలీస్ బందోబస్తు
పోలీసుల పహారాలో భూసేకరణకు సన్నాహాలు
— PulseNewsBreaking (@pulsenewsbreak) October 24, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

