న్యూఢిల్లీ, అక్టోబర్ 27: మౌలిక రంగంలో పెట్టుబడులు ఆకర్షించడా నికి కేంద్రం కొత్తగా ఏర్పాటుచేసిన ఆర్థిక సంస్థ నాబ్ఫిడ్కు చైర్మన్‌గా ప్రసిద్ద బ్యాంకర్ కేవీ కామత్ నియమితులయ్యారు. నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డెవలప్మెంట్ (నాబ్‌ఫిడ్) బిల్లుకు ఈ ఏడాది మార్చిలో పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఈ చట్టం కింద రూ.20 వేల కోట్ల పెట్టుబడితో నెలకొల్పిన కొత్త ద్రవ్య సంస్థకు కేవీ కామత్‌ను కేంద్ర ప్రభుత్వం చైర్మన్‌గా నియమించినట్లు బుధవారం ఆర్థిక సర్వీసుల శాఖ ట్వీట్ చేసింది. 1971లో అప్పటి ద్రవ్య సంస్థ ఐసీఐసీఐలో వృత్తిజీవితాన్ని ప్రారంభించిన కామత్ 2009లో ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీగా పదవీ విరమణ చేశారు. అటుతర్వాత కొద్ది సంవత్సరాలు ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా వ్యవహరించారు.