Kuwait: అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు 12.5 లక్షల పరిహారం ప్రకటించిన కువైట్
Kuwait : అగ్ని బాధిత కుటుంబాలకు కువైట్ సర్కారు నష్టపరిహారాన్ని ఇవ్వనున్నది. ప్రతి ఒక్క బాధిత కుటుంబానికి సుమారు 12.5 లక్షలు ఇవ్వనున్నట్లు కువైట ప్రభుత్వం ప్రకటించింది. మన్‌గాఫ్ సిటీలోని ఏడు అంతస్థుల భవనంలో జూన్ 12న అగ్నిప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదంలో 50 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంట్లో 46 మంది భారతీయులే ఉన్నారు.
కువైట్ సిటీ: కువైట్(Kuwait)లోని అహ్మది గవర్నేట్‌లో ఇటీవల ఓ బిల్డింగ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 50 మంది మృతిచెందగా, దాంట్లో 46 మంది భారతీయులే ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ బాధిత కుటుంబాలకు కువైట్ సర్కారు నష్టపరిహారాన్ని ఇవ్వనున్నది. ప్రతి ఒక్క బాధిత కుటుంబానికి సుమారు 12.5 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మన్‌గాఫ్ సిటీలోని ఏడు అంతస్థుల భవనంలో జూన్ 12న అగ్నిప్రమాదం సంభవించింది.
కువైట్ రాజు షేక్ మెషాల్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సాబాహ్ ఈ ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 15 వేల డాలర్లు ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. బాధిత వ్యక్తలకు చెందిన ఎంబసీలకు పేమెంట్‌ను ఇవ్వనున్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు ఫిలిప్పీన్స్ వాసులు కూడా మరణించారు. నష్టపరిహారం ప్రతి బాధిత కుటుంబానికి చేరుకునేలా ఎంబసీలు చర్యలు తీసుకోనున్నాయి.
భారత ప్రభుత్వం బాధిత కుటుంబాలకు రెండు లక్షల నష్టపరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక కేరళ సర్కారు కూడా ఆ రాష్ట్ర బాధిత ఫ్యామిలీలకు 5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. కువైట్ అగ్నిప్రమాదంలో 24 మంది కేరళ వాసులు మరణించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

