నేడు జోడేఘాట్‌లో కుమ్రం భీం వర్ధంతి
ఆదివాసీల ఆరాధ్యదైవం కుమ్రం భీం 85వ వర్థంతిని కెరమెరి మం డలం జోడేఘాట్‌లో సోమవారం నిర్వహించనున్నా రు. వర్ధంతి నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లుచేశారు. ఈ సందర్భంగా నిర్వహించే సభకు మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ హాజరుకానున్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ) : ఆదివాసీల ఆరాధ్యదైవం కుమ్రం భీం 85వ వర్థంతిని కెరమెరి మం డలం జోడేఘాట్‌లో సోమవారం నిర్వహించనున్నా రు. వర్ధంతి నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లుచేశారు. ఈ సందర్భంగా నిర్వహించే సభకు మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ హాజరుకానున్నారు. రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనపై అసంతృప్తిగా ఉన్న ఆదివాసీలు భీం వర్ధంతి సభలో అధికారులను, ప్రజాప్రతినిధులను నిలదీసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది.
ముఖ్యంగా ఆదివాసీలు సాగుచేసుకుంటున్న పోడు భూములకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండున్నరేండ్ల కాలంలో ఒక్క పట్టాకూడా ఇవ్వకపోవటంతోపాటు వేధింపులు ఎక్కువకావటం ఆదివాసీలను ఆందోళనకు గురిచేస్తున్నది. బీఆర్ఎస్ పాలనలో జిల్లాలో దాదాపు 47 వేల ఎకరాల భూములకు కేసీఆర్ హక్కు పట్టాలు అందించడంతోపాటు రైతుబంధు అమలు చేశారు. జోడేఘాట్‌ను రూ.25కోట్లతో పర్యాటక ప్రాం తంగా మార్చటంతోపాటు హట్టి గ్రామం నుంచి జోడేఘాట్ వరకు రూ.15 కోట్లతో రెండు వరుసల రహదారిని నిర్మించా రు. అయితే కాంగ్రెస్ పాలనలో ఆదివాసీలపై వేధింపులు ఎక్కువ కావడంతో ఆందోళన చేసే అవకాశం ఉండటంతో భారీగా పోలీ సులను మోహరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

