సీపీఎస్ రద్దుపై జాప్యం వద్దు : ఎస్టీయూ
రాష్ట్రంలో కంట్రిబ్యూటరీ పెన్షన్ సీమ్ (సీపీఎస్) రద్దుపై ప్రభుత్వం జాప్యం చేయరాదని, ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం అధ్యయన కమిటీని ఏర్పాటు చేయాలని స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (ఎస్టీయూ టీఎస్) డిమాండ్ చేసింది. ఆదివారం హైదరాబాద్‌లోని సంఘ భవనంలో ఎస్టీయూ రాష్ట్రస్థాయి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది.
హైదరాబాద్, అక్టోబర్ 25(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కంట్రిబ్యూటరీ పెన్షన్ సీమ్ (సీపీఎస్) రద్దుపై ప్రభుత్వం జాప్యం చేయరాదని, ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం అధ్యయన కమిటీని ఏర్పాటు చేయాలని స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (ఎస్టీయూ టీఎస్) డిమాండ్ చేసింది. ఆదివారం హైదరాబాద్‌లోని సంఘ భవనంలో ఎస్టీయూ రాష్ట్రస్థాయి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జీ సదానందం గౌడ్ మాట్లాడుతూ.. ఓపీఎస్ వెంటనే పునరుద్ధరించడానికి ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేయాలని కోరారు. ఉపాధ్యాయ సమస్యల పరిషారానికి సీఎం ప్రత్యేక చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. రెండు దశాబ్దాలుగా అపరిషృతంగా ఉన్న ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్యను పరిషరించాలని, విద్యాశాఖలో జీవో 190 అమలు చేయాలని డిమాండ్ చేశారు.
పీఆర్సీ ప్రక్రియ, ఉద్యోగుల నూతన హెల్త్ సీమ్ పారదర్శకంగా అమలు చేయాలని కోరారు. డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఎయిడెడ్, మోడల్, గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులకు 010 హెడ్ కింద ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలని, రేషనలైజేషన్ జీవో 25ను సవరించాలని అన్నారు. సమగ్ర శిక్షా, గిరిజన సంక్షేమ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బందికి టైమ్ సేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్, పూర్వ అధ్యక్షుడు ఎం పర్వత్‌రెడ్డి, నాయకులు సయ్యద్ సాబేర్ ఆలీ, ఎల్ఎం ప్రసాద్, కరుణాకర్‌రెడ్డి, పోల్‌రెడ్డి, ఎవీ సుధాకర్, శంకర్ మాతంగి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

