అమిత్‌షాను గోబెల్స్‌తో పోల్చిన కర్ణాటక మాజీ సీఎం
Kumaraswamy | కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతున్నది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాపై మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామిపై మండిపడ్డారు. అంతటితో
బెంగళూరు : కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతున్నది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాపై మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామిపై మండిపడ్డారు. అంతటితో ఆగకుండా షాను గోబెల్స్‌తో పోల్చారు. జోసెఫ్ గోబెల్స్ కొత్త అవతారం అమిత్ షా అంటూ కుమారస్వామి అభివర్ణించారు. కేంద్రంలోని గత ఎనిమిదేళ్ల ప్రభుత్వ పాలనలో షా దేశాన్ని విధ్వంస మార్గంలోకి తీసుకెళ్లారని ఆరోపించారు. అమిత్ షాపై ఆరోపణలు చేస్తూ జేడీఎస్ నేత కుమారస్వామి వరుస ట్వీట్లు చేశారు. షాను రాజకీయ ఊసరవెల్లి అని, బీజేపీ ఓ కపట పార్టీ అంటూ ధ్వజమెత్తారు.
జేడీఎస్‌కు ఓటు వేస్తే తమ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఏటీఎంగా మారుతుందన్నారు. కోట్లాది మంది కన్నడిగుల ఏటీఎంగా జేడీఎస్ మారుతుందని, రైతులు, కూలీలు, నిరుపేదలు, నిరుపేదల ఏటీఎంలుగా మారుతామన్నారు. ఏటీఎం అంటే ఎనీటైమ్ హ్యుమానిటీ అన్నారు. అయితే బీజేపీకి ఏటీఎం అంటే.. ‘ఎనీ టైమ్ మోసం’ అంటూ విమర్శించారు. అబద్ధాలతో దేశాన్ని విధ్వంస మార్గంలోకి తీసుకెళ్తోందని ధ్వజమెత్తారు. కుమారస్వామి వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య స్పందించారు. జేడీఎస్ పార్టీ సంక్షోభ పార్టీగా మారిందని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ కనుమరుగవుతుందన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

