KTR Slams BJP and Congress | కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ వివాదంపై స్పందిస్తూ ఆయన ఎక్స్ వేదికగా బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీల తీరును ఎండగడుతూ అత్యంత వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బేటీ పడావో, బేటీ బచావో (ఆడపిల్లలను చదివించండి, ఆడపిల్లలను రక్షించండి) నినాదాన్ని గుర్తు చేస్తూ, ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు దానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయని మండిపడ్డారు. ఇప్పుడు ఆ నినాదం కాస్తా బేటా భగావో, బేటా బచావో (కొడుకును పంపించివేయి, కొడుకును రక్షించు) అన్న చందంగా మారిపోయిందని కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఎద్దేవా చేశారు. మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగిన కేసులో నిందితుడిని రక్షించేందుకు అటు బీజేపీ, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పరస్పరం సహకరించుకుంటున్నాయని కేటిఆర్ ఎక్స్ వేదికగా రాసుకోచ్చాడు.