తాండూర్ : ఆపదలో ఆదుకునే పేదల పెన్నిధి బీఆర్ఎస్ వర్కంగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అని తాండూర్ బీఆర్ఎస్ (BRS ) నాయకులు అన్నారు. కేటీఆర్ పుట్టిన రోజు (KTR Birthday) సందర్భంగా తాండూర్ మండల కేంద్రం ఐబీలో బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. పా
ర్టీ మండల అధ్యక్షుడు సుబ్బ దత్తుమూర్తి మాట్లాడుతూ పేదలకు ఏ కష్టమొచ్చినా, అర్ధరాత్రయిన కేటీఆర్ ఆదుకుంటూ పేదల పెన్నిదిగా పేరు తెచ్చుకుంటున్నారన్నారు. తెలంగాణను ప్రపంచంలో అగ్రభాగాన నిలబెట్టిన ఘనత కేటీఆర్ దేనని తెలిపారు. తెలంగాణను ఐటీ రంగంలో దేశం గర్వించేలా తీర్చిదిద్దారన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పూసాల ప్రణయ్, గట్టు సంతోష్, పురుషోత్తంగౌడ్, దత్తాత్రేయరావు, మాసాడి శ్రీరాములు, ఎలుక రాంచందర్, బోనగిరి చంద్రశేఖర్, పెర్క రాజన్న, జాడి పోశం, గడ్డం మణికుమార్, బోడ సతీష్, మద్దిబోయిన అర్జున్, ఎక్బాల్, క్రాంతి, మండిగ రవిందర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.