రఘునందన్ కృషి స్ఫూర్తిదాయకం.. నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటయ్
చిన్న వయసులోనే సామాజిక బాధ్యతను గుర్తించి, ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మల్లారం గ్రామానికి చెందిన దుగ్గిదేవర శ్రీరఘునందన్ను బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. రఘునందన్ సేవ స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ) : చిన్న వయసులోనే సామాజిక బాధ్యతను గుర్తించి, ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మల్లారం గ్రామానికి చెందిన దుగ్గిదేవర శ్రీరఘునందన్ను బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. రఘునందన్ సేవ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. విద్యార్థి దశ నుంచే సామాజిక కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయమని ప్రశంసించారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. రఘునందన్‌కు తన ఆశీస్సులు, ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటాయని భరోసా ఇచ్చారు. శుక్రవారం తెలంగాణ భవన్లో కేటీఆర్‌ను రఘునందన్ కలిశారు. సొంతూరులో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి పదేండ్లుగా చేస్తున్న కృషిని వివరించారు.
కేసీఆర్ జన్మదినం సందర్భంగా పాఠశాల దత్తత
‘పదేండ్ల క్రితం కేసీఆర్ తాతయ్య జన్మదినం సందర్భంగా మా ఊరిలో ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను. మహేశ్ బాబు నటించిన ‘శ్రీమంతుడు’ సినిమా నాకు స్ఫూర్తినిచ్చింది. గ్రామానికి నా వంతుగా ఏదైనా చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాను’ అని రఘునందన్ వివరించారు. తన తల్లిదండ్రులు అజయ్ కుమార్, విజయలక్ష్మి సహకారంతో 2016లో ఆరో తరగతి చదువుతున్నప్పుడే మల్లారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి కృషి చేయడం ప్రారంభించానని పేర్కొన్నారు.
ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేలా
పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన, పరిశుభ్రత, పచ్చదనం, నీటి సంరక్షణకు ప్రాధాన్యమిస్తూ పలు కార్యక్రమాలు చేపట్టానని రఘునందన్ పేర్కొన్నారు. తాజాగా పాఠశాలలో ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ వస్తువులను సమకూర్చానని తెలిపారు. ప్రస్తుతం పాఠశాలలోని 51 మంది విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిళ్లు, మధ్యాహ్న భోజనం కోసం స్టీల్ ప్లేట్లు అందించానని చెప్పారు. ప్రతి తరగతి గదిలో తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించేందుకు స్టీల్ డస్ట్ బిన్లు, చేతులు శుభ్రం చేసుకునేందుకు స్టీల్ సబ్బు పెట్టెలు, పాఠశాల రికార్డుల కోసం స్టీల్ ట్రేలు ఏర్పాటు చేశానని వెల్లడించారు. మరుగుదొడ్లలో అల్యూమినియం బకెట్లు, మగ్గులు, ప్రయోగశాల సామగ్రి నిల్వకు గాజు సీసాలు సమకూర్చానని పేర్కొన్నారు.
జాతీయ స్థాయిలో పాఠశాలకు గుర్తింపు
రఘునందన్ కృషితో మల్లారం పాఠశాల స్వచ్ఛ విద్యాలయ కార్యక్రమంలో పలు అవార్డులు సాధించింది. 2016 17లో కేంద్ర ప్రభుత్వ జాతీయ స్థాయి స్వచ్ఛ విద్యాలయ అవార్డుతో పాటు రాష్ట్ర, జిల్లా స్థాయి అవార్డులు అందుకున్నది. 2017 18లోనూ రాష్ట్ర, జిల్లా స్థాయిలో గుర్తింపు పొందింది. తాజాగా 2025 26 విద్యా సంవత్సరంలో జిల్లా స్థాయిలో స్వచ్ఛ విద్యాలయ అవార్డును సాధించింది. ప్లాస్టిక్ రహిత పాఠశాలగా రూపుదిద్దుకున్న మల్లారం బడి.. ఇతర పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

