ఆత్మగౌరవం లేని ఢిల్లీ పార్టీలు
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఢిల్లీ పెద్దల ముందు తలవంచుతున్నారని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు తీవ్రస్థాయిలో విమర్శించారు.
- కాంగ్రెస్ సంచులు మోసే పార్టీ ! బీజేపీ చెప్పులు మోసే పార్టీ!!
- ముఖ్యమంత్రి రేవంత్‌ను ప్రియాంక బౌన్సర్లు నెట్టివేస్తున్నరు!
- అమిత్‌షా ముందు బౌన్సర్లా కేంద్రమంత్రి బండి పరుగులా?
- తనకన్నా చిన్నోడైన అమిత్‌షా కాళ్లకు రాంచందర్‌రావు దండాలా?
- ఆ పార్టీలను నమ్మితే ఢిల్లీ, గుజరాత్‌లకు తెలంగాణను అమ్మేస్తరు
- తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక
హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఢిల్లీ పెద్దల ముందు తలవంచుతున్నారని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్ర హకుల కంటే తమ రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నాయకత్వల ముందు తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో ప్రియాంకగాంధీ భద్రతా సిబ్బంది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని పకకు నెట్టేసిన ఘటనను ప్రస్తావిస్తూ.. ‘ఆయనకు కాంగ్రెస్‌లో ఇచ్చే గౌరవం ఏందో ఈ ఘటనతోనే తేలిపోయింది’ అని వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు తనకంటే వయసులో చిన్నవాడైన అమిత్‌షా కాళ్లకు నమసరించాల్సిన పరిస్థితి రావడం రాష్ట్ర ఆత్మగౌరవాన్ని దిగజార్చడమేనని కేటీఆర్ దుయ్యబట్టారు. అమిత్‌షా పర్యటనలో బండి సంజయ్ బౌన్సర్లా వ్యవహరించారంటూ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్‌ను సంచులు మోసే పార్టీగా, బీజేపీని చెప్పులు మోసే పార్టీగా అభివర్ణించారు. తెలంగాణ ప్రయోజనాల కంటే అధిష్ఠానాల ఆదేశాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయని విమర్శించారు. ఢిల్లీ నాయకుల పర్యటనలు, సమావేశాలు తప్ప రాష్ట్రానికి కొత్త మెట్రో విస్తరణలు, జాతీయ ప్రాజెక్టులు, దవాఖానలు, కళాశాలలు, పాఠశాలలు, అదనపు ఆర్థిక నిధులు ఏవీ తీసుకురాలేకపోయారని విమర్శించారు. తెలంగాణ భవన్లో బుధవారం శేరిలింగంపల్లి నియోజకవర్గం హైదర్‌నగర్ డివిజన్ కాంగ్రెస్ నాయకుడు అవుకు దామోదర్‌రెడ్డి తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్లో చేరగా, కేటీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నాయకుల ముందు తాకట్టు పెట్టే కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలే తగిన సమాధానం చెప్తారని హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే శక్తి బీఆర్ఎస్కే ఉన్నదని, కేసీఆర్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, హకుల కోసం కేంద్రాన్ని నిలదీయాల్సిన రాష్ట్ర నాయకులు తమ వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం ఢిల్లీ పెద్దల ముందు మోకరిల్లుతున్నరు. సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడ్తున్నరు. అందుకే కాంగ్రెస్ సంచులు మోసే పార్టీ, బీజేపీ చెప్పులు మోసే పార్టీ. కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలే తగిన సమాధానం చెప్తారు.
– కేటీఆర్
అమిత్ షా వచ్చి ఏం ఇచ్చారు?
ఢిల్లీ నేతల పర్యటనలతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని కేటీఆర్ మండిపడ్డారు. ‘అమిత్ షా తెలంగాణకు వచ్చి చేతులూపుతూ వెళ్లడం తప్ప రాష్ట్రానికి ఒక ప్రాజెక్టునైనా తీసుకొచ్చారా? మెట్రో విస్తరణ, జాతీయ ప్రాజెక్టులు, జాతీయ స్థాయి విద్యాసంస్థలు, దవాఖానలు పాఠశాలలు, కళాశాలలు లేదా ప్రత్యేక నిధులు ఏమైనా సాధించారా?’ అని ప్రశ్నించారు. రాష్ట్రానికి రావాల్సిన హకులు, నిధులు, ప్రాజెక్టుల కోసం కేంద్రాన్ని నిలదీయాల్సిన రాష్ట్ర నాయకులు తమ వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం పెద్దల ముందు మోకరిల్లుతున్నారని విమర్శించారు. ఇటీవలి అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో బండి సంజయ్ వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. కేంద్ర మంత్రిగా ఉండాల్సిన గౌరవాన్ని పకనపెట్టి బౌన్సర్లా వ్యవహరించారని, కరీంనగర్ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాల్సిన నాయకుడు ఇలా చేయడం సరికాదన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు వయసులో ఆరేం డ్లు చిన్నవాడైన అమిత్ షా కాళ్లు మొక్కి, అంతటి విధేయత చూపడం ఎందుకని నిలదీశారు.

ఢిల్లీలో రేవంత్‌రెడ్డికి అవమానకర పరిస్థితి
ఢిల్లీలో ప్రియాంకాగాంధీతో సమావేశం సందర్భంగా రేవంత్‌రెడ్డిని ఆమె భద్రతా సిబ్బంది నెట్టివేశారని కేటీఆర్ ఆరోపించారు. అందుకు సంబంధించిన వీడియో అంశాన్ని ప్రస్తావించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎంపీ స్థాయి నాయకురాలి వద్ద ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం ఏమిటని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి పరిపాలనను గాలికొదిలి ఢిల్లీ పెద్దల చుట్టూ తిరగడానికే ప్రాధాన్యమిస్తున్నారని విమర్శించారు. ‘రేవంత్‌రెడ్డి ఈఎంఐ ముఖ్యమంత్రి. ఢిల్లీ పర్యటనలతోనే పాలన సాగిస్తున్నారు’ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు తీసుకురాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. భూ దందాలు, కమీషన్ల కోసమే ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ రేవంత్ పంచన చేరారని ఆరోపించారు. కేసీఆర్‌ను చూసి నాడు బీఆర్ఎస్ను గెలిపించారే తప్ప, రేవంత్‌రెడ్డిని చూసి ఎవరూ ఓటు వేయలేదని పేర్కొన్నారు.
కాళేశ్వరంపై కక్ష.. పాలమూరుపై పగ
తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందించాల్సిన ప్రభుత్వం.. కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షపూరితంగా, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని కేటీఆర్ ఆరోపించారు. నీళ్లు ఉన్నా రైతులు, ప్రజలకు అందించలేని, బొగ్గు ఉన్నా విద్యుత్తును ఉత్పత్తి చేయలేని పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు. రైతులు, మహిళలు, పేదలు, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాలనూ ఇబ్బందుల్లోకి నెట్టిన ప్రభుత్వంగా కాంగ్రెస్ నిలిచిందని మండిపడ్డారు.
సీఎం రేవంత్ పరిపాలనను గాలికొదిలి ఢిల్లీ పెద్దల చుట్టూ తిరగడానికే ప్రాధాన్యమిస్తున్నారు. ఆయనొక ఈఎంఐ ముఖ్యమంత్రి. ఢిల్లీ పర్యటనలతోనే పాలన సాగిస్తున్నారు. రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు తీసుకురాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడ్తున్నరు. హైదరాబాద్‌లో కేసీఆర్ ప్రభుత్వం లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మిస్తే.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మాత్రం ఒక్క ఇల్లయినా కట్టించారా? ఆయన ఇండ్లు కూల్చడంలో ముందున్నారు.
– కేటీఆర్
కాంగ్రెస్ నిర్లక్ష్యంతో హైదరాబాద్‌లో తాగునీటి సమస్య
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే హైదరాబాద్‌లో మళ్లీ తాగునీటి సమస్య తలెత్తుతున్నదని కేటీఆర్ విమర్శించారు. నగర జనాభా భవిష్యత్తులో మరింత పెరిగినా తాగునీటి కొరత రాకుండా కేసీఆర్ ప్రభుత్వం ముందుచూపుతో మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టులను నిర్మించిందని గుర్తుచేశారు. హైదరాబాద్‌కు నిరంతర తాగునీటి సరఫరా ఉండేలా దీర్ఘకాలిక ప్రణాళికలు అమలుచేసిందని చెప్పారు. నీటి వనరులు, ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని సక్రమంగా వినియోగించుకోలేకపోవడం కాంగ్రెస్ అసమర్థతకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేదని, ఇప్పుడు మళ్లీ జనరేటర్లు, ఇన్వెర్టర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని కేటీఆర్ ప్రశ్నించారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి వంటి భారీ ప్రాజెక్టులు నిర్మించినా వాటిని సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నారని విమర్శించారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే రాజకీయాలకంటే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలని, కమీషన్లకు ప్రాధాన్యం ఇచ్చే నాయకత్వాన్ని కాకుండా కేసీఆర్ నాయకత్వాన్ని తిరిగి బలపరచాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
హామీలపై ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు?
ఎన్నికల హామీలను అమలుచేయకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తున్నదని కేటీఆర్ ధ్వజమెత్తారు. మూడు నెలల్లో హామీలన్నీ అమలు చేస్తామన్న నాయకులు ఇప్పుడేం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డికి లొల్లి ఎకువ.. విజ్ఞానం తక్కువ అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లతో పోల్చితే ఈ ప్రభుత్వం ఒక ఇటుకైనా పేర్చిందా, ఒక ఇలె్లైనా నిర్మించిందా? అని నిలదీశారు. లక్ష ఇండ్ల నిర్మాణం పేరుతో చేస్తున్న ప్రకటనలు ఆషాఢపు ఆఫర్ల మాదిరిగా ఉన్నాయని దెప్పిపొడిచారు.
హైడ్రా పేరుతో పేదలపై వేధింపులు
హైడ్రా వ్యవహారశైలిపై కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చెరువుల ఆక్రమణల పేరుతో పేదలు, మధ్యతరగతి ప్రజల ఇండ్లపై బుల్డోజర్లు నడిపిస్తున్నారని, అదే సమయంలో అధికారంలో ఉన్న పెద్దల అక్రమ నిర్మాణాల విషయంలో మాత్రం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బిల్డర్లను బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు హైడ్రాను సాధనంగా ఉపయోగిస్తున్నారనే విమర్శించారు. దుర్గం చెరువుకట్టపై సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు ఇల్లు నిర్మించారని, హిమాయత్‌సాగర్ వద్ద మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమ నిర్మాణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. చెరువు మధ్యలోనే పట్నం మహేందర్‌రెడ్డి ఇల్లు నిర్మించారని, మంత్రి వివేక్‌కు కూడా ఇలాంటి నిర్మాణాలు ఉన్నాయని పేరొన్నారు. కొడంగల్‌లోని రెడ్డికుంటలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం ఇల్లు నిర్మించుకున్నారని విమర్శించారు. అధికారంలో ఉన్నవారికి ఒక న్యాయం.. సామాన్యులకు మరో న్యాయమా? అని ప్రశ్నించారు.
భూముల అమ్మకంపై తొందరెందుకు?
మియాపూర్‌లోని 550 ఎకరాల ప్రభుత్వ భూములపై తీర్పు వచ్చిన 24గంటల్లోనే అమ్మేస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించడం వెనుక ఆంతర్యమేందని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే, అధికారిక ఉత్తర్వులు రాకముందే మియాపూర్ భూములను హడావుడిగా విక్రయించేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి ప్రజా సమస్యల కంటే భూముల లావాదేవీలపైనే ఆసక్తి చూపుతున్నారని విమర్శించారు. విలువైన భూములను కేవలం కమీషన్ల కోసం విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆ భూములను ప్రజావసరాలకు వినియోగించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ మేరకు ఉద్యమకారులకు 250 గజాల చొప్పున భూములు పంపిణీ చేయాలని కేటీఆర్ కోరారు. మియాపూర్ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే బదులు పేదలకు ఇండ్లు నిర్మించాలని సూచించారు. ఈ 550 ఎకరాల్లో 200 ఎకరాలను పేదల గృహ నిర్మాణానికి, 100 ఎకరాలను అమరవీరుల కుటుంబాలకు, మిగతా భూములను ఉద్యమకారులు, పిల్లల గృహ నిర్మాణం, కళాశాలలు, పారుల కోసం వినియోగించాలని హితవు పలికారు. ప్రజలకు ఉపయోగపడాల్సిన భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడాన్ని సహించబోమని హెచ్చరించారు.
హిల్ట్ పాలసీ పేరుతో 10 వేల ఎకరాల దందా
హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్(హిల్ట్) పాలసీ పేరుతో సుమారు 10వేల ఎకరాల పారిశ్రామిక భూములను ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. పరిశ్రమల పేరుతో గతంలో రాయితీలపై కేటాయించిన భూములను వారికి కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. 21 పారిశ్రామిక ప్రాంతాల్లో సుమారు 10వేల ఎకరాల భూములను ప్రభుత్వానికి సన్నిహితులైన వారికి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. శేరిలింగంపల్లిలోని 100 ఎకరాల అలైడ్ అల్యూమినియం పరిశ్రమ భూముల విలువ సుమారు రూ.10 వేల కోట్లు ఉంటుందని, వాటిని కేవలం రూ.100 నుంచి రూ.150 కోట్లకే ప్రైవేట్ అభివృద్ధి కోసం విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని పేరొన్నారు. పరిశ్రమలు మూతపడితే ఆ భూములను ప్రజా అవసరాలకు వినియోగించాలని సూచించారు. అకడ పారులు, చెరువులు, బస్ డిపోలు, శ్మశానవాటికలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. భూముల లావాదేవీల్లో అక్రమాలకు పాల్పడేవారు ఎవరైనా భవిష్యత్తులో పరిణామాలు ఎదురోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మియాపూర్ భూములు పంచుతామని, భూ దందాలు చేసిన వారి అంతుచూస్తామని తేల్చిచెప్పారు. కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని, అప్పుడు అక్రమ భూ ఒప్పందాలన్నీ రద్దు చేస్తామని స్పష్టంచేశారు.
పడిపోయిన ఆస్తుల విలువ
రెవెన్యూ శాఖలోని 22-ఏ నిబంధనను కూడా కేటీఆర్ తప్పుబట్టారు. ఈ విధానం పేరుతో అనేక కాలనీలను నిషేధిత జాబితాలో చేర్చి ప్రజల ఆస్తుల లావాదేవీలకు ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో రియల్ఎస్టేట్ రంగం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీవ్రంగా దెబ్బతిన్నదని, రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల విలువైన ప్లాట్లు కలిగిన మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు కూడా ఆస్తుల విలువ పడిపోవడంతో నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. కేసీఆర్ హయాంలో చేపట్టిన అభివృద్ధి, గృహ నిర్మాణ కార్యక్రమాలతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం ప్రచారానికే పరిమితమైందని విమర్శించారు. హామీల అమలు, పేదల ఇండ్లు, పారిశ్రామిక భూముల పరిరక్షణలో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిన కేసీఆర్
హైదరాబాద్‌లో కేసీఆర్ ప్రభుత్వం లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించి పేదలకు అందించిందని కేటీఆర్ గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇప్పటివరకు ఒక ఇల్లయినా నిర్మించిందా? అని ప్రశ్నించారు. పేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వడం చేతకాకపోయినా, వారి ఇండ్లను కూల్చడంలో మాత్రం ముందున్నదని విమర్శించారు. చెరువుల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, కానీ అక్రమాల పేరుతో పేదల ఇండ్లను కూల్చడం పరిషారం కాదని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు వివేకానందగౌడ్, మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు.
ఎల్లమ్మ సిద్ధోగం కార్యక్రమానికి రండి
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట గౌడ సంఘం సభ్యులు గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన ఎల్లమ్మ తల్లి సిద్ధోగం కార్యక్రమానికి రావాల్సిందిగా బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆహ్వానించారు.

ఎల్లమ్మ తల్లి ప్రతిమతోపాటు గౌడ సంప్రదాయానికి ప్రతీక అయిన గడను తీసుకొచ్చి సంప్రదాయబద్ధంగా ఆహ్వానం పలికారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, టెసాబ్ మాజీ చైర్మన్ కొండూరి రవీందర్రావు, సర్పంచ్ నర్సింహులు, ఎంపీటీసీ సభ్యుడు పరశురాములుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
– హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ)
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

