రైతుగర్జన స్ఫూర్తితో ఉత్సాహంగా పనిచేయాలి
ఆదిలాబాద్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన రైతుగర్జన సభ విజయవంతం కావడంతో ఆ పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలను పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు.
- ఆదిలాబాద్ సభ విజయవంతంపై జిల్లా నేతలు, కార్యకర్తలకు కేటీఆర్ అభినందనలు
హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన రైతుగర్జన సభ విజయవంతం కావడంతో ఆ పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలను పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. అదే స్ఫూర్తితో పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంగా పనిచేయాలని, రైతాంగ సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు.
మాజీ మంత్రి జోగు రామన్న, నాయకులు భార్గవ్ దేశ్‌పాండే, జోగు మహేందర్ బుధవారం తెలంగాణ భవన్లో కేటీఆర్‌ను కలిశారు. రైతుగర్జన సభ విజయంతో ఆగిపోకుండా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరగా, వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ బలోపేతానికి ప్రతి ఒకరూ సమిష్టిగా కృషిచేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

