మేం అర్హులమే‘ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్'(UNFPA) ఇండియాకు లింగ సమానత్వ గౌరవ రాయబారిగా నటి కృతి సనన్ ఎంపియ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సినీ పరిశ్రమలోని లింగ వివక్షపై ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.
‘సౌకర్యాల విషయంలోనే కాదు, గౌరవం విషయంలోనూ ఇండస్ట్రీలో అసమానతే. నిజానికి హీరోలతో సమానమైన గౌరవానికి మేం అర్హులం. కానీ లొకేషన్లో మాకు ఆ గౌరవం దొరకదు. పెద్దపెద్ద కార్లు, విలాసవంతమైన గదులు హీరోలకు కేటాయిస్తారు. హీరోయిన్లు సామాన్యమైన సౌకర్యాలతో సర్దుకోవాల్సిందే. చూడ్డానికి ఇవి చిన్న విషయాల్లాగే కనిపిస్తాయి. కానీ మనసును మాత్రం చాలా బాధిస్తాయి. హీరోలు సెట్స్‌కి ఆలస్యంగా వస్తారు. హీరోయిన్లు మాత్రం టైమ్‌కి రావాలి. అసిస్టెంట్ డైరెక్టర్లు మాకు చెప్పినంత ఈజీగా త్వరగా రమ్మని హీరోలకు చెప్పలేరు. ఈ ఆలోచనా విధానంలో మార్పురావాలి.’ అంటూ ఆవేశంగా మాట్లాడారు కృతి సనన్.