జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌పై కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ నిప్పులు చెరిగారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఓ యూజ్లెస్ ఫెలో.. అతనికి కామన్ సెన్స్ లేదని మండిపడ్డారు. అసలు ఏ పార్టీనో తెలియని వ్యక్తి.. మాపై విమర్శలు చేయడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. నీకు దమ్ముంటే రాజీనామా చెయ్.. నీ మీద నేను పోటీ చేస్తా అని సవాలు విసిరారు.
రెండేళ్లలో జగిత్యాల సమస్యల గురించి ఒక్కరోజైనా అసెంబ్లీలో ప్రస్తావించావా అని సంజయ్‌కుమార్‌ను కల్వకుంట్ల సంజయ్ నిలదీశారు. జగిత్యాల గురించి మాట్లాడే హక్కు నీకెక్కడిదని ప్రశ్నించారు. కేసీఆర్ పెట్టిన భిక్ష నీ జగిత్యాల ఎమ్మెల్యే పదవి అని వ్యాఖ్యానించారు. జగిత్యాల జిల్లా స్వప్నాన్ని కేసీఆర్ నెరవేర్చారని.. కానీ నీకు అవకాశం ఇచ్చిన కేసీఆర్‌ను, జగిత్యాల ప్రజలను మోసం చేసి స్వలాభం కోసం అధికార పార్టీలో చేరావని మండిపడ్డారు.
నీకు దమ్ముంటే రాజీనామా చేయి.. నీమీద నేను పోటీ చేస్తా
జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్‌కు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఛాలెంజ్
నువ్వు ఏ పార్టీలో ఉన్నావో చెప్పడం లేదు కదా, దమ్ముంటే రాజీనామా చేయి, నీ మీద నేను పోటీ చేస్తాను
రెండేళ్లలో జగిత్యాల సమస్యల గురించి ఒక్కరోజైనా… https://t.co/iHrq97NZhD pic.twitter.com/c7JCsKh1iS
— Telugu Scribe (@TeluguScribe) December 16, 2025
జగిత్యాల జిల్లా ప్రజలకు కీలకమైన మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు రెండేళ్లుగా నత్తనడకన నడుస్తుంటే ఏం చేస్తున్నావని సంజయ్‌కుమార్‌ను కల్వకుంట్ల సంజయ్ ప్రశ్నించారు. కోరుట్ల ప్రజలు జగిత్యాల ఆస్పత్రికి వస్తే ఎందుకొచ్చారని అంటున్నారని ఆయన మండిపడ్డారు. అసలు నీకు కామన్సెన్స్ ఉందా అని సంజయ్‌కుమార్‌పై ధ్వజమెత్తారు. మరి నీ నడుంనొప్పికి హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నావని ప్రశ్నించారు. రేపు పొద్దున జగిత్యాల కలెక్టర్‌కు కోరుట్ల ప్రజలు ఎందుకొస్తున్నారని ప్రశ్నిస్తారా అని నిలదీశారు. జగిత్యాల జిల్లా హెడ్‌క్వార్టర్ కాబట్టి జిల్లాలోని ప్రజలందరూ వస్తారని ఆయన గుర్తుచేశారు. సంజయ్‌కుమార్ మాటలు చూస్తుంటే ఆయన రాజకీయ అభద్రతతను చాటుతున్నాయని ఎద్దేవా చేశారు.