అగ్ర నటుడు బాలకృష్ణ 112వ సినిమా ప్రకటన వెలువడింది. కొరటాల శివ దర్శకత్వంలో బాలకృష్ణ చేయనున్న ఈ ప్రాజెక్ట్ గురించి గత కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. శుక్రవారం ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. సామాజిక అంశాలు కలబోసి మాస్ ఎంటర్‌టైనర్స్‌ను రూపొందించడంతో సిద్ధహస్తుడైన కొరటాల శివ దర్శకత్వంలో బాలకృష్ణ తొలిసారి నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి.
ఈ సందర్భంగా శుక్రవారం రిలీజ్ చేసిన పోస్టర్‌పై ‘పవర్మీట్స్ పర్పస్, మాస్ బికమ్స్ ఓ మూవ్మెంట్’ అనే ట్యాగ్‌లైన్ కథాంశం తాలూకు సారాంశాన్ని తెలియజేసేలా ఉంది. కొరటాల శివ గత చిత్రాల తరహాలోనే బలమైన సామాజిక అంశాలు మేళవించిన కథ ఇదని, బాలకృష్ణ పాత్ర సరికొత్త పంథాలో సాగుతుందని మేకర్స్ చెబుతున్నారు. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలకానుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని కూడా త్వరలో వెల్లడించనున్నారు. యువసుధ ఆర్ట్స్ ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించబోతున్నది.