మూడు ముళ్లు పడినా, ఏడడుగులు నడచినా ఇద్దరినీ ఒక్కటిగా జత కలిపేది మాత్రం బ్రహ్మముడే. అందుకే, కొంగుముడి వేసే తంతుకు వివాహ సంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యం ఉంటుంది.
అమ్మాయిని, అబ్బాయిని…ఆలూమగలుగా కలిపే ఆ బ్రహ్మముడినే వివాహ ఆహ్వాన పత్రికకు కవర్పేజీగా తీర్చిదిద్దుతున్నారు నేటి డిజైనర్లు. శారీధోతీ వెడ్డింగ్ కార్డ్స్ పేరిట ఇవి ప్రాచుర్యం పొందుతున్నాయి. నిజమైన ధోతీ, చీర వస్త్రంతోనే వీటిని తీర్చి దిద్దుతున్నారు. మన ఇష్టాన్ని బట్టి రంగులూ మార్చుకోవచ్చు. సాధారణ పెండ్లి పత్రికలానే దీన్నీ తెరిచి లోపల ఉన్న విషయం చదువుకోవచ్చు. ముందుంది మాఘమాసం.. ముచ్చటైన పత్రిక సిద్ధమా మరి!