IPL 2026 Champion : ఐపీఎల్లో 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఛాంపియన్‌గా అవతరించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టైటిల్ నిలబెట్టుకుంది. 19వ సీజన్లో ఛాంపియన్ ఆటతో ఫైనల్ చేరిన ఆర్సీబీ అదిరే ఆటతో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) ఆశలపై నీళ్లు చల్లింది. క్వాలిఫయర్ 1లో చిత్తైన గుజరాత్‌ను భువనేశ్వర్(2-29), రసిక్ దారల్ సలాం(3-27)లు 155కే పరిమితం చేయగా.. ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ(75 నాటౌట్) ఖతర్నాక్ అర్ధ శతకంతో బెంగళూరును గెలిపించాడు. బ్యాటర్ల వైఫల్యంతో మ్యాచ్‌లో వెనబడిన శుభ్‌మన్ గిల్ సేన రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
ఐపీఎల్ 19లో ఆర్సీబీ ఛాంపియన్ ఆటతో విజేతగా నిలిచింది. క్వాలిఫయర్ 1లో గుజరాత్ టైటాన్స్‌ను అలవోకగా ఓడించిన ఆర్సీబీ ఫైనల్లోనూ టాప్ గేర్‌లో ఆడి రెండోసారి ట్రోఫీని ముద్దాడింది. తొలుత గుజరాత్‌ను 155కే కట్టడి చేసిన ఆర్సీబీ లక్ష్యం వైపు వడివడిగా అడుగులేసింది. స్వల్ప ఛేదనలో ఓపెనర్లువెంకటేశ్ అయ్యర్(32), విరాట్ కోహ్లీ(75 నాటౌట్) శుభారంభమిచ్చారు. రబడ ఓవర్లో 4, 6, 4, 4 బాదిన అయ్యర్ ఏకంగా 18 పరుగులు పిండుకున్నాడు. సిరాజ్ ఓవర్లో రెండు ఫోర్లు బాదిన విరాట్ అనంతరం రబడను లక్ష్యంగా చేసుకొని రెండు బౌండరీలు, సిక్సర్‌తో స్కోర్ 50 దాటించాడు. దంచేస్తున్న ఈ జోడీని సిరాజ్ విడదీసి తొలి బ్రేకిచ్చాడు. జట్టు స్కోర్ 62 వద్ద అయ్యర్ సులువుగా రబడ చేతికి దొరికాడు.
𝘾.𝙃.𝘼.𝙈.𝙋.𝙄.𝙊.𝙉.𝙎 🏆🏆@RCBTweets have done it again ❤️#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/ww2zB98Xb8
— IndianPremierLeague (@IPL) May 31, 2026
ఆ తర్వాతి ఓవర్లోనే పడిక్కల్(1) గాల్లోకి లేపిన బంతిని బౌండరీ వద్ద అర్షద్ ఖాన్ ఒడుపుగా అందుకున్నాడు. ఆర్సీబీ ఎండో వికెట్ కోల్పోయింది. అదే ఓవర్లో చివరి బంతికి కోహ్లీ సిక్సర్ బాదగా ఆర్సీబీ పవర్ ప్లేలో రెండు వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. స్ట్రాటజిక్ బ్రేక్ అనంతరం రషీద్ ఖాన్ ఒకే ఓవర్లో పటిదార్(15), కృనాల్ పాండ్యా(1)ను ఔట్ చేసి గుజరాత్ శిబిరంలో ఆశలు రేపాడు. కానీ, టిమ్ డెవిడ్(24)తో కోహ్లీ కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. విజయానికి 24 పరగుల దూరంలో డేవిడ్ ఔటైనా.. జితేశ్ శర్మ(11 నాటౌట్)తో కలిసి విరాట్ లాంభనం ముగించాడు. అర్షద్ వేసిన18వ ఓవర్లో కోహ్లీ 4, 6 బాదడంతో బెంగళూరు 5 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.
Cometh the hour, cometh the King! 🫡
25-ball 5️⃣0️⃣ in on the grandest stage 👏👏
Updates ▶️ https://t.co/Yz6K3q6w0X#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/jsEIZuTDC2
— IndianPremierLeague (@IPL) May 31, 2026
క్వాలిఫయర్ 1లో తేలిపోయిన గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు ఫైనల్లోనూ తడబడ్డారు. అహ్మదాబాద్‌లో ఆర్సీబీ పేసర్ల ధాటికి పవర్ ప్లేలోనే కెప్టెన్ శుభ్‌మన్ గిల్(10), సాయి సుదర్శన్(12)లు పెవిలియన్ చేరగా.. మిడిలార్డర్ చేతులెత్తేసింది.

వ్యూహాత్మకంగా బ్యాక్ లెంగ్త్, బౌన్సర్లతో భువనేశ్వర్(2-29), రసిక్ దార్ సలాం(3-27) గుజరాత్ హిట్టర్లను కట్టడి చేయగా.. వాషింగ్టన్ సుందర్(50 నాటౌట్) అర్ధ శతకంతో పోరాడాడు. అతడు చివరిదాకా నిలబడడంతో గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేయగలిగింది.