నబటియహ్: ఇజ్రాయెల్ సైన్యం 26 ఏండ్ల తర్వాత లెబనాన్‌లోకి చొచ్చుకెళ్లింది. నబటియహ్ నగరం సమీపంలోని కీలకమైన బ్యూఫోర్ట్ కోటను స్వాధీనం చేసుకొన్నట్టు ఆదివారం తెలిపింది. కోటకు దగ్గర్లోని గ్రామాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసి హెజ్బొల్లా సభ్యులతో పోరాటం చేసిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.
హెజ్బొల్లాతో జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్‌కు ఇది కీలక విజయాన్ని అందించింది. కాల్పుల విరమణ నామమాత్రంగా అమలవుతున్న వేళ ఇజ్రాయెల్ సైన్యం బ్యూఫోర్ట్‌ను స్వాధీనం చేసుకుంది.