సర్జరీ నుంచి కోలుకుంటున్నా: కేఎల్ రాహుల్
మునిచ్: టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ ఇటీవల సర్జరీ చేయించుకున్నాడు. అయితే ఆ సర్జరీ విజయవంతమైందని, దాని నుంచి కోలుకుంటున్నట్లు అతను తెలిపాడు. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌కు గాయం కారణంగా రాహుల్ దూరమైన విషయం తెలిసిందే. గజ్జల వద్ద నొప్పి వల్ల రాహుల్ విరామం తీసుకున్నాడు. తన క్షేమం కోరుతూ ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ అతను థ్యాంక్స్ తెలిపాడు. కొన్ని వారాల పాటు ఇబ్బందిపడ్డానని, ఇప్పుడు కోలుకుంటున్నట్లు చెప్పాడు. కానీ సర్జరీ సక్సెస్ అయినట్లు తెలిపాడు. అయితే షెడ్యూల్ ప్రకారం ఇంగ్లండ్‌తో జరిగే అయిదవ టెస్టుకు కూడా రాహుల్ దూరం కానున్నాడు.
రాహుల్‌కు జర్మనీలో సర్జరీ జరిగింది. స్పోర్ట్స్ హెర్నియా కోసం అక్కడ చికిత్స చేయించుకున్నాడు. మరి కొన్ని నెలల పాటు రాహుల్ ఆటకు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దిగువ ఉదర సంబంధిత సమస్యలతో రాహుల్ సతమతం అయ్యాడు. గజ్జల వద్ద నొప్పి, తొడ కండరాలు పట్టేయడం వంటి సమస్యలతో రాహుల్ బాధపడ్డాడు. 30 ఏళ్ల రాహుల్ ఇప్పటి వరకు 42 టెస్టులు, 42 వన్డేలు, 56 టీ20లు ఆడాడు. రాహుల్ మళ్లీ ఇండియా తరపున ఆడాలంటే కనీసం కొన్ని నెలల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రోజుల రెస్ట్ తర్వాత అతనికి ఎన్సీఏలో శారీరక శిక్షణ ఉంటుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

