దర్శకుడు రమేష్ వర్మ ఖరీదైన బహుమతి అందుకున్నారు. రవితేజతో ‘ఖిలాడీ’ సినిమా రూపొందించిన ఈ దర్శకుడికి చిత్ర నిర్మాత కోనేరు సత్యనారాయణ రూ.1.15 కోట్ల విలువైన రేంజ్ రోవర్ కారును గిఫ్ట్ గా అందించారు. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ‘ఖిలాడీ’ సినిమా ఫిబ్రవరి 11న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి నాయికలుగా నటించారు.