Mallikarjun Kharge | నిరసనను వాయిదావేసే ప్రసక్తే లేదు, ర్యాలీ నిర్వహించి తీరుతాం : మల్లికార్జున్ ఖర్గే
Mallikarjun Kharge | ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ను నిరసిస్తూ ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా చేపట్టనున్న నిరసన కార్యక్రమాన్ని వాయిదావేసే ప్రసక్తేలేదని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు (Congress President) మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) స్పష్టంచేశారు. నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానం (Ramleela Maidaan) లో ఇండియా కూటమి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ కొనసాగుతుందని చెప్పారు.
Mallikarjun Kharge : ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ను నిరసిస్తూ ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా చేపట్టనున్న నిరసన కార్యక్రమాన్ని వాయిదావేసే ప్రసక్తేలేదని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు (Congress President) మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) స్పష్టంచేశారు. నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానం (Ramleela Maidaan) లో ఇండియా కూటమి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ కొనసాగుతుందని చెప్పారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే తమ పోరాట లక్ష్యమని పేర్కొన్నారు.
ఎన్నికల సంఘం చేపడుతున్న ‘ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)’ ప్రక్రియలో ఓట్ల చోరీ, అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఈ నిరసనకు పిలుపునిచ్చింది. ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వ్యవహరించిన తీరుపై కూడా ఖర్గే విమర్శలు చేశారు. ఓటర్ల హక్కులకు భంగం కలుగుతోందని ఆరోపిస్తూ ఈ అంశంపై తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. అన్ని ప్రతిపక్ష పార్టీలు తమకు మద్దతుగా ఉన్నాయని వెల్లడించారు.
పండుగల సీజన్లో భారీ ర్యాలీ నిర్వహిస్తే ఢిల్లీలో వ్యాపార కార్యకలాపాలు దెబ్బతింటాయని పలు వ్యాపార సంఘాలు ఆందోళన వ్యక్తంచేశాయి. ర్యాలీని మరో తేదీకి మార్చాలని రాహుల్‌గాంధీని కోరాయి. పెద్దఎత్తున జనసమీకరణ వల్ల వ్యాపార వాతావరణం దెబ్బతినడంతోపాటు తమ జీవనోపాధిపై ప్రభావం పడుతుందని వ్యాపారులు పేర్కొన్నారు. అయితే ఈ విజ్ఞప్తుల నేపథ్యంలోనూ నవంబర్ 1న నిరసన కొనసాగుతుందని ఖర్గే స్పష్టంచేశారు.
మరోవైపు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో నిరసనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ మార్చ్ ఏ ఒక్క పార్టీకి సంబంధించినది కాదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం, ఓట్ల చోరీని అడ్డుకోవడం, రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసమని అన్నారు. రాజకీయ భేదాలకు అతీతంగా విద్యార్థి సంఘాలు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు. ప్రజాస్వామ్య స్వేచ్ఛలు, వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తంచేసే హక్కులు ముప్పును ఎదుర్కొంటున్నాయని ఆయన ఆరోపించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chain Snachers | చైన్ స్నాచింగ్ దొంగలను చితకబాదిన కిష్టమ్మ.. వీడియో
Mallikarjun Kharge | నిరసనను వాయిదావేసే ప్రసక్తే లేదు, ర్యాలీ నిర్వహించి తీరుతాం : మల్లికార్జున్ ఖర్గే
పీఎం శ్రీ ప్రధానోపాధ్యాయులకు బెంగళూరులో శిక్షణ
ఎంజీయూలో వినూత్న కార్యక్రమం.. ‘ఎర్న్ వైల్ యు లెర్న్’
ACB Net | రెవెన్యూ రికార్డులో పేరును సరిదిద్దేందుకు లంచం డిమాండ్..ఏసీబీకి చిక్కిన జీపీవో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

