మాగనూర్, ఆగస్టు 26: నారాయణపేట జిల్లా మహిళా అభ్యర్థులకు శుభవార్త. మాగనూర్లోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో ఖాళీగా ఉన్న CRT (హిందీ) గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టు భర్తీకి అధికారులు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మాగనూర్ ఎంఈవో గణేశ్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత ఉన్న స్థానిక మహిళా అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కేజీబీవీ మాగనూర్ పాఠశాల/కళాశాలలో CRT (హిందీ) పోస్టు ఒకటి ఖాళీగా ఉన్నట్లు మాగనూర్ ఎంఈవో గణేష్ సింగ్ తెలిపారు. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీతో పాటు బీఈడీ విద్యార్హత కలిగి ఉండాలని పేర్కొన్నారు.
అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 26 నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. బయోడేటాతో పాటు విద్యార్హతల ధ్రువపత్రాల ప్రతులు, ఆధార్ కార్డు, పాస్పోర్టు సైజు ఫొటోను జతచేసి కేజీబీవీ మాగనూర్ పాఠశాలలో స్వయంగా దరఖాస్తు సమర్పించాలి. ఈ పోస్టుకు నారాయణపేట జిల్లా స్థానిక మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులని అధికారులు స్పష్టం చేశారు. దరఖాస్తులను కేజీబీవీ మాగనూర్ స్పెషల్ ఆఫీసర్ రాధికకు అందించాలని సూచించారు.