కేరళలో మంకీపాక్స్ .. అయిదో కేసు నమోదు
న్యూఢిల్లీ: కేరళలో మరో మంకీపాక్స్ కేసు నమోదు అయింది. యూఏఈ నుంచి వచ్చిన వ్యక్తి పాజిటివ్‌గా తేలాడు. దీంతో కేరళలో మంకీపాక్స్ సోకిన వారి సంఖ్య అయిదుకు చేరుకున్నది. ఇక దేశవ్యాప్తంగా ఆ వైరస్ కేసుల సంఖ్య ఏడుకు చేరింది. మంకీపాక్స్ లాంటి లక్షణాలతోనే ఇటీవల ఓ వ్యక్తి కేరళలో మృతిచెందిన విషయం తెలిసిందే. కేరళలో కొత్త మంకీపాక్స్ కేసు నమోదు అయినట్లు మంత్రి వీణా జార్జి తెలిపారు. మల్లప్పురంలో 30 ఏళ్ల పేషెంట్ చికిత్స తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. జూలై 27వ తేదీన యూఏఈ నుంచి అతను కోజికోడ్ వచ్చాడు. మంజేరీ మెడికల్ కాలేజీలో అతను చికిత్స పొందుతున్నాడు. ఇటీవల మంకీపాక్స్ లక్షణాలతో మరణించిన కేసులో త్రిసూర్ జిల్లాలో 20 మందిని క్వారెంటైన్ చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Kerala
- Monkeypox
- positive case
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

