యాక్షన్ మోడ్‌లో డీఎస్పీ ప్రేమ్‌రాజ్
తమిళ అగ్ర హీరో సూర్య పోలీస్ పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘సీన్'. ‘ఆవేశం’ ఫేమ్ జీతూ మాధవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్లో నజ్రియా నజీమ్ కథానాయికగా నటిస్తున్నది.
తమిళ అగ్ర హీరో సూర్య పోలీస్ పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘సీన్’. ‘ఆవేశం’ ఫేమ్ జీతూ మాధవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్లో నజ్రియా నజీమ్ కథానాయికగా నటిస్తున్నది. జ్యోతిక, సూర్య నిర్మిస్తున్న ఈ సినిమా దీపావళి సందర్భంగా ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకురానుంది. తెలుగు రాష్ర్టాల్లో ఎన్వీఆర్ సినిమా రిలీజ్ చేస్తున్నది. ఆదివారం ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఇందులో డీఎస్పీ ప్రేమ్‌రాజ్ పాత్రలో సూర్య కనిపించారు. ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటాడు ప్రేమ్‌రాజ్. అయితే ఓ ప్రమాదకరమైన క్రిమినల్ కేసు ఆయన్ని తిరిగి రంగంలోకి దిగేలా చేస్తుంది. క్రూరుడైన విలన్ని పట్టుకునే క్రమంలో ప్రేమ్‌రాజ్ చేసే సాహసాలు, ఆయనకు ఎదురైన సవాళ్ల నేపథ్యంలో ట్రైలర్ ఉత్కంఠను పంచింది. యాక్షన్, కామెడీ అంశాల్ని మేళవిస్తూ ఇన్వెస్టిగేటివ్ డ్రామాగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఈ చిత్రానికి సుశిన్ శ్యామ్ సంగీతాన్నందించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

