Keerthy Suresh | నేషనల్ అవార్డు విన్నింగ్ హీరోయిన్ కీర్తిసురేశ్ (Keerthy Suresh) ప్రస్తుతం బాలీవుడ్ యాక్టర్ వరుణ్ ధవన్ (Varun Dhawan)తో బేబీ జాన్ (Baby John)లో నటిస్తుందని తెలిసిందే. కీర్తిసురేశ్ ఈ మూవీలో వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోండగా.. వామికా గబ్బి మరో హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. బేబీజాన్ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవాప్తంగా క్రిస్మస్ కానుకగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ విషయాన్ని తెలియజేస్తూ కొత్త లుక్ విడుదల చేశారు మేకర్స్. వరుణ్ ధవన్ గుండాలతో తలపడేందుకు రెడీ అవుతున్నాడని తాజా లుక్ చెబుతోంది. బేబీ జాన్ చిత్రాన్ని కోలీవుడ్ డైరెక్ట్ కాలీస్ డైరెక్ట్ చేస్తుండగా.. జవాన్ డైరెక్టర్ అట్లీ నిర్మిస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ నుంచి ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తోంది.
కాగా ఈ మూవీలో కీర్తిసురేశ్ బోల్డ్ లిప్‌లాక్ సీన్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ ఓ వార్త సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. యాక్షన్ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. సినీ1 స్టూడియోస్, జియో స్టూడియోస్‌తో కలిసి ప్రియాఅట్లీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బేబీజాన్ కీర్తిసురేశ్ బాలీవుడ్ డెబ్యూ సినిమా కావడం విశేషం. కీర్తిసురేశ్ ప్రస్తుతం తమిళంలో నాలుగు సినిమాల్లో నటిస్తోంది.
బేబీజాన్ రిలీజ్ డేట్..
VARUN DHAWAN – ATLEE – JIO STUDIOS – MURAD KHETANI ANNOUNCE *NEW* RELEASE DATE OF ‘BABY JOHN’: CHRISTMAS 2024… [Wednesday] 25 Dec 2024 #Christmas is the new release date of #BabyJohn, which stars #VarunDhawan in his first-ever action role.
Also features #KeerthySuresh,… pic.twitter.com/WmVCTyE6f3
— taran adarsh (@taran_adarsh) June 26, 2024