ముంబై: ఆరు పదుల వయసులో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విజయవంతంగా సైకిల్ యాత్ర పూర్తి చేసిన మొహిందర్ సింగ్ భరాజ్ నయా రికార్డు నెలకొల్పాడు. ‘రేస్ అగైనెస్ట్ ఏజ్’పేరిట చేపట్టిన సైకిల్ యాత్రను 67 ఏండ్ల మొహిందర్ ఆదివారం ముగించాడు. శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు 3,600 కిలోమీటర్ల దూరాన్ని 12 రోజుల 18 గంటల 57 నిమిషాల్లో పూర్తి చేశాడు. రోజుకు 18 గంటల చొప్పున 275 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ ఈ ఫీట్ నమోదు చేశారు. యాత్ర పూర్తైన తర్వాత మొహిందర్ మాట్లాడుతూ.. ‘నిరాశతో కాలం వెళ్లదీసే వృద్ధులకు భిన్నంగా నేను నిరంతరం ఆశావహ దృక్పథంతో జీవిస్తా. నిరంతరం సైక్లింగ్ కొనసాగిస్తా.. భవిష్యత్తులో మరిన్ని సుదీర్ఘ యాత్రలు చేపడుతా’అని అన్నాడు.