Karnataka : నేడు కర్ణాటక కేబినెట్ విస్తరణ.. మధ్యాహ్నం మంత్రుల ప్రమాణం
నేడు కర్ణాటక కేబినెట్ విస్తరణ.. మధ్యాహ్నం మంత్రుల ప్రమాణం | కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మంత్రివర్గాన్ని బుధవారం విస్తరించనున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం.. కొత్త మంత్రులు

బెంగళూరు : కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కేబినెట్‌ను బుధవారం విస్తరించనున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం.. కొత్త మంత్రులు ఇవాళ మధ్యాహ్నం 2.15 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. మాజీ ముఖ్యమంతి యెడియూరప్పతో సంప్రదించిన తర్వాత కొత్త మంత్రుల పేర్లు ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని జాబితా సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అయితే, యెడియూరప్ప తన పదవీ కాలంలో నియమించిన ఉప ముఖ్యమంత్రిని కొనసాగించాలనే నిర్ణయంపై పార్టీ నేతల్లో భిన్నాభిప్రాయాలున్నాయి.
ఈ క్రమంలో ఆయన పదవిలో కొనసాగిస్తారా? లేదంటే తప్పిస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది. ఈ అంశంపై బీజేపీ నాయకత్వం యెడియూరప్పతో చర్చిస్తుందని, అలాగే యెడియూరప్ప తనయుడు విజయేంద్ర పేరు సైతం కొత్త మంత్రుల జాబితాలో పేరున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. కేబినెట్ మంత్రుల ఎంపికలో తాను జోక్యం చేసుకోనని మాజీ సీఎం ఇంతకు ముందే స్పష్టం చేశారు. తన వారసుడిని కొత్త ముఖ్యమంత్రి పార్టీ నాయకత్వంతో సంప్రదించి.. తీసుకునే స్వేచ్ఛ ఆయనకు ఉందన్నారు. అయితే, మంత్రివర్గ విస్తరణలో 20 నుంచి 25 మందితో మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
Tokyo Olympics : జావెలిన్ త్రోలో ఫైనల్స్‌కు నీరజ్ చోప్రా అర్హత
UAE Lifts Ban : నిషేధం ఎత్తివేసిన యూఏఈ.. అనుమతి ఎవరికంటే?
Accident : మాలిలో ఘోర రోడ్డు ప్రమాదం.. 41 మంది మృత్యువాత
TTD : నేడు టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల
Andhrapradesh : ఆర్థికశాఖలో ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

