సినిమా హాళ్లలో సీటింగ్ సామర్థ్యం 50శాతమే..
సీటింగ్ సామర్థ్యం | పెరుగుతున్న కొవిడ్ కేసులతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా హాళ్లలో సీటింగ్ సామర్థ్యాన్ని 50శాతానికి మించొద్దని ఆదేశాలు జారీ చేసింది.

కర్ణాటక : పెరుగుతున్న కొవిడ్ కేసులతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా హాళ్లలో సీటింగ్ సామర్థ్యాన్ని 50శాతానికి మించొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర్వులు ఈ నెల 7న నుంచి అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. సినిమాళ్లలో సీటింగ్ సామర్థ్యం 50 శాతం తగ్గిస్తామని గత శుక్రవారం ప్రభుత్వం ప్రకటించింది. సీటింగ్ సామర్థ్యాన్ని కుదించొద్దని కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి, కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి సీఎం యడ్యూరప్పకు పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వచ్చాయి. అయినా ప్రభుత్వం వాటిని పక్కన పెట్టి సగం సీటింగ్ కేపాజిటీతో నడపాలని ఆదేశించింది.
అయితే, ఓ వైపు కొవిడ్ కేసులు పెరుగుతున్నా శనివారం రాత్రి బెంగళూరులోని వీరేశ్ థియేటర్లో జనం గుమిగూడి కనిపించడం ఆందోళన కలిగించింది. గత శుక్రవారం ప్రభుత్వం కొత్త కొవిడ్ మార్గదర్శకాలు జారీ చేసింది. పలు జిల్లాల పరిధిలో పబ్బులు, రెస్టారెంట్లలో 50శాతానికి మించి వినియోగదారులు మించొద్దని ఆదేశించడంతో పాటు పలు ఆంక్షలు విధించింది. ఇదిలా ఉండగా.. శనివారం కర్ణాటకలో 4373 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదవగా, 19 మంది మృతి చెందారు. ఇందులో మూడువేలకుపైగా కేసులు బెంగళూరు అర్బన్ ప్రాంతం నుంచే ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
బెంగాల్ పోల్స్ : నాలుగో విడుత బరిలో 22శాతం మంది నేరచరితులు
నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం
ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్: 15 మంది జవాన్లు గల్లంతు!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

