బెంగాల్ పోల్స్ : నాలుగో విడుత బరిలో 22శాతం మంది నేరచరితులు

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగో విడుత బరిలో ఉన్న 372 మంది అభ్యర్థుల్లో దాదాపు 22శాతం మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఒక నివేదికలో పేర్కొంది. ఈ నెల 10న జరుగనున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న 373 మంది అభ్యర్థులో 372 మంది దాఖలు చేసిన నామపత్రాలను ఏడీఆర్ విశ్లేషించింది. అయితే, కేంద్రం ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఉన్న అసంపూర్ణ అవిఫిడవిట్ కారణంగా సప్తగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న స్వతంత్య అభ్యర్థి బిష్ణు చౌదరి రికార్డులు విశ్లేషించలేకపోయినట్లు పేర్కొంది.
372 మంది అభ్యర్థులు 81 మంది (22శాతం) అభ్యర్థులు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారని, 65 మంది (17)శాతం మంది అభ్యర్థులు తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని వెల్లడించారని, మరో 65 మంది (17శాతం) తాము కోటీశ్వరులమని పేర్కొన్నట్లు ఏడీఆర్ నివేదిక పేర్కొంది. ప్రధాన పార్టీల్లో బీజేపీ నుంచి 27 మంది, కాంగ్రెస్‌కు చెందిన 9 మంది, తృణమూల్ కాంగ్రెస్ నుంచి 17 మంది, ఎస్‌యూసీఐ(సీ) పార్టీ నుంచి ఒకరు తమ అఫిడవిట్లలో తమపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు ప్రకటించారని ఏడీఆర్ వివరించింది. 19 మంది అభ్యర్థులు తమపై.. మహిళపై నేరారోపణలకు సంబంధించిన కేసులున్నట్లు ప్రకటించారు. నలుగురు అభ్యర్థులు తమపై అత్యాచార కేసులున్నట్లు తెలిపారు. 16 మంది అభ్యర్థులు తమపై హత్యాయత్నం కేసులున్నట్లు వెల్లడించినట్లు ఏడీఆర్ వివరించింది.
ఇవికూడా చదవండి..
ఫిక్స్డ్ డిపాజిట్లపై టీడీఎస్.. ఎలా నివారించుకోవాలంటే..?
పెళ్లి తర్వాత ఆధార్ కార్డులో పేరు ఎలా మార్చాలి?
రేపటి నుంచి 71 అన్రిజర్వ్డ్ రైలు సర్వీసులు
‘ఇడ్లీ’ అమ్మకు సొంత ఇల్లు
బ్యాటరీ లైఫ్ 28 వేల ఏండ్లు!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

