– రాజేందర్ రెడ్డి, కొంపల్లి
ఉత్తర భాగం మూత వేయడం సరైన విషయం కాదు. అలా కారు పార్కింగ్ కోసం ఉత్తరంలో కప్పు వేసినప్పుడు ఆ పిల్లర్లకు, ఉత్తర ప్రహరీకి మధ్య కనీసం ఆరు అడుగులను మించి స్థలం వదలాలి. అలాగే దక్షిణంలో నాలుగు లేదా ఐదు అడుగులు మాత్రమే ఖాళీ వదిలి కాంపౌండ్ కట్టాలి. ఉత్తరంలో వదిలిన స్లాబ్ మీద ఎలాంటి నిర్మాణం లేకుండా.. పై భాగంలో దానిని బాల్కనీగా వాడుకోవాలి. అంటే ఇంటి వెడల్పు కింద ఎంత ఉందో పైన కూడా అంతే ఉండాలి. పైన ఉత్తరం పెంచి కింద ఉత్తరం తగ్గించి డూప్లెక్స్ ఇల్లు కట్టవద్దు. కింద వాడకుండా.. మీదమీద రెండు అంతస్తులు బయటినుంచి మెట్లు పెట్టుకొని కట్టుకోవచ్చు. అలా ఎన్ని అంతస్థులు వేసుకున్నా ఏ ఇల్లుకు ఆ ఇల్లు వేరుగా ఉంటే ఇబ్బంది ఉండదు. ప్రతి ఇంటికీ ఒక పద్ధతి ఉంటుంది. తెలుసుకొని కట్టాలి.
– ఆరాధ్య, చేర్యాల
ఇంటికి నాభి స్థానం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఇంటి పొడవు వెడల్పు ఎంత ఉన్నా కూడా.. దాని మూలాలు కలుపుతూ ఇంటి ఆకారంలో గీసినప్పుడు, రెండు రేఖలు ఒకదానిని ఒకటి ఖండిస్తూ ఉండే ఒక బిందువు వస్తుంది. అది ఆ ఇంటినాభి. దానికి సరిగ్గా దక్షిణంలో లేదా పడమరలో మెట్లు వేసుకొని, ఆ నాభిస్థానంలో గానీ లేదా దానికి ఉత్తర-తూర్పులల్లో గానీ హాల్ ఏర్పాటు చేసి డూప్లెక్స్ ఇల్లు కట్టాలి. అంతేకానీ దక్షిణ-ఆగ్నేయంలో మెట్లు రాకూడదు.

అదంతా తూర్పు-ఆగ్నేయం కలుపుకొని వంటగది, యుటిలిటీ ఏరియా వస్తుంది. దక్షిణ-నైరుతి, పడమర-వాయవ్య దిశల్లో పడక గదులు వస్తాయి. ఈ విధమైన గదుల విభజనతో ఇంటిని నిర్మించాలి. మీరు అన్ని విధాలుగా పూర్తిగా తెలుసుకొని మీ ఇంటిని కట్టుకోండి. అప్పుడే అన్నీ శుభంగా ఉంటాయి.
– గుర్రం భారతి, చంపాపేట
ఇంటికి చుట్టు పక్కల ఇండ్లు కిందికి ఉండటం పట్టణాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అవన్నీ పరిసర వాస్తు కిందికి వస్తాయి. మన ఇంటి ఫ్లోరింగ్, భూమి ఎత్తు కలుపుకొంటే పక్క ఇల్లు ఆరు అడుగుల కన్నా మించి ఉంటే.. దాని ప్రభావం మన ఇంటి మీద ఉంటుంది. మనం దక్షిణంలో ఎంత మేరకు ఖాళీ స్థలం వదులుతాము అనే దాన్నిబట్టి పక్క స్థలం చెడును తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఎంతలోతు ఉందో అంతకు రెండు రెట్ల స్థలం వదిలి మన ఇల్లు కట్టాలి.

వదిలిన భాగంలో సగం మాత్రమే లెక్కించి కాంపౌండ్ కట్టాలి. అంటే దక్షిణం పదిహేను అడుగులు వదిలితే.. అందులో ఏడు ఫీట్ల స్థలం దక్షిణంవైపు వదిలి కాంపౌండ్ నిర్మించాలన్నమాట. ఇంత వదులుకొని ప్రహరీ నిర్మించ లేనప్పుడు ఆ స్థలం మంచిది కాదు. అందులో ఇల్లు కట్టినా ఆ చెడు ప్రభావం మన ఇంటి మీద ఉంటుంది.
– కనకం శ్రీనివాస్, ఆలేరు
ఇవ్వాళ్ల కమర్షియల్ నిర్మాణాలు అన్నీ ఇలాగే కడుతున్నారు. ఇది ఒక భయంకరమైన స్థితికి చేరుకుంటుంది. తద్వారా షాపుల ప్రగతి లేకుండా పోతుంది. చాలామంది విదేశీ విధానాలు, గ్లాస్ ఎలివేషన్ల మోజులో పడి నిర్మాణపు ఉనికి మీద పూర్తి పట్టు కోల్పోతున్నారు.

డూప్లెక్స్ నిర్మాణాలు చేసి దక్షిణంలో, పడమరలో మెట్లు, లిప్టులు పెట్టి ఇంటికి తూర్పు- ఉత్తరం బాల్కనీలు లేకుండా కట్టవద్దు. అలా చేస్తే గృహం పూర్తిగా నిర్వీర్యం అవుతుంది. నిర్మాణం ఏదైనా తూర్పును, ఉత్తరాన్ని ఆహ్వానించే ద్వారాలతో.. బాల్కనీలతో ఉన్నప్పుడే అది జీవ గృహం అవుతుంది. శుభాలు ఇస్తుంది. మీరు అన్ని విధాలుగా శాస్త్రీయంగా ప్లాన్ చేసుకున్నాకే ఇంటి నిర్మాణం చేయండి. యూట్యూబ్ జ్ఞానాలు పనికిరావు.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143