యాదాద్రి, డిసెంబర్ 19: కరివెన సత్రం అన్నార్తులకు ధర్మక్షేత్రమని ఎమ్మెల్సీ సురభి వాణీదేవి అన్నా రు. దేశంలోని అనేక పుణ్యక్షేత్రాల్లో కరివెన సత్రాలు నెలకొల్పాలని ఆకాంక్షించారు. ఆదివారం యాదాద్రి లక్ష్మీనరసింహుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం యాదగిరిగుట్టలో అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వాణీదేవి మాట్లాడుతూ.. సత్రాల అభివృద్ధికి బ్రాహ్మణోత్తములు సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సంస్థ అధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్రావు, సంస్థ గౌరవాధ్యక్షుడు నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.