Karimnagar | పరారులో భూ మాఫియా!.. ‘నమస్తే’ కథనంతో వెలుగులోకి కోతిరాంపూర్ భూకబ్జా
Karimnagar | కరీంనగర్ నడిబొడ్డున భూ కబ్జా వ్యవహారంలో తీగ లాగితే డొంకంతా కదులుతున్నది. 'నమస్తే తెలంగాణ' కథనంతో కోతిరాంపూర్ కబ్జా వెలుగులోకి రాగా, పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నట్టు తెలిసింది.
Karimnagar | కరీంనగర్ నడిబొడ్డున భూ కబ్జా వ్యవహారంలో తీగ లాగితే డొంకంతా కదులుతున్నది. ‘నమస్తే తెలంగాణ‘ కథనంతో కోతిరాంపూర్ కబ్జా వెలుగులోకి రాగా, పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నట్టు తెలిసింది. అయితే, ఎక్కడ తమను అరెస్ట్ చేస్తారేమోననే భయంతో నిందితులు ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి పరారైనట్టు తెలుస్తున్నది. నిందితులను అరెస్ట్ చేయవద్దంటూ ఒత్తిడి తెచ్చిన ఓ జాతీయ పార్టీ నేత.. ఇప్పుడు పోలీసులకు ఏం చెప్పాలో తెలియక షాక్‌లో ఉన్నట్టు తెలిసింది.
కరీంనగర్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరీంనగర్ నడిబొడ్డున కబ్జా బాగోతంపై ‘మళ్లీ తెరపైకి భూ మాఫియా!’ శీర్షికన గురువారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం సంచలనం రేపింది. కోతిరాంపూర్‌లో విలువైన దాదాపు మూడు గుంటల సామా న్యుల భూమి కబ్జాకు యత్నించిన తీరు కలకలం రేపింది. నిజానికి ఈ వ్యవహారంపై ఈనెల 15న వన్టేన్ పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. ఓ జాతీయ పార్టీకి చెందిన నేత జోక్యంతో ఆ అరెస్టు నిలిచిపోయినట్టు అత్యంత విశ్వసనీయ సమా చారం. ఏకంగా జాతీయ పార్టీ నేత పోలీసులకు ఫోన్ చేసి చెప్పడంతో ఇక తమను అరెస్టు చేసేవారు లేరనే ధీమాతో నిందితులు ఇన్నాళ్లు దర్జాగా తిరిగినట్టు తెలిసింది.
అయితే కబ్జాకు ప్రయత్నించడం, అలాగే పోలీసులు కేసు నమోదు చేసినా అరెస్టు చేయకుండా ఆపడం, ఓ జాతీయ నాయకుడి జోక్యం వల్ల జరుగుతున్న పరిణామాలను ‘న మస్తే’ వెలుగులోకి తేవడంతో గురువారం పరిస్థితి అంతా ఒక్కసారిగా మారిపోయినట్టు తెలుస్తున్నది. వ్యవహారం మొత్తం బయటికి రావ డంతో 13 మంది నిందితుల్లో కీలక సూత్రధారులుగా భావిస్తున్న మాజీ ప్రజాప్రతినిధితో సహా ఆరుగురు తాజాగా అదృశ్యమైనట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. గురువారం ఉదయమే వారిని కమి షనరేట్ కార్యాలయానికి పిలిపించేందుకు ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (ఈవోడబ్ల్యూ) పోలీసులు ఫోన్ చేయగా, వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ వచ్చినట్టు తెలిసింది. దీంతో మరిన్ని వివరాలు ఆరా తీసిన పోలీసులు.. వారు నగరంలో లేరని నిర్ధారించుకున్నట్టు సమాచారం. మరోవైపు మరి కొంతమందిని కమిషనరే ట క్కు పిలిపించి, కేసుకు సంబంధించిన మరింత సమా చారం సేకరించినట్టు తెలిసింది. అయితే ఈ వ్యవహా రంలో తవ్వినకొద్దీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా ఇక్కడ జరిగిన లేఔట్లో అనేక అక్రమాలు జరిగినట్టు తెలుస్తున్నది. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ మొత్తంలో ప్లాట్లను విక్రయించినట్టు పోలీసుల విచార ణలో గుర్తించినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా, ఈ విషయంపై సంబం ధిత తహసీల్దారు లిఖితపూర్వకంగా రిపోర్ట్ సమర్పించాలని పోలీ సులు కోరినట్టు తెలుస్తున్నది. అయితే ఇప్పటివరకు జరిగిన పరిణామా లన్నీ నిబంధనలకు విరుద్ధమేనని, బోగస్ పత్రాలు సృష్టించి కబ్జాలకు పాల్పడ్డారని సంబంధిత తహసీల్దార్.. పోలీసులకు చెప్పినట్టు తెలుస్తు న్నది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా కబ్జా వ్యవహారాన్ని తీసుకెళ్లినట్టు తెలిసింది.
పోలీసులపై ఒత్తిడి తెచ్చిన బడా నేతకు షాక్
నిందితులను అరెస్టు చేయవద్దంటూ పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ జాతీయ పార్టీ నేతకు తాజా పరి ణామాలు షాక్ నిచ్చినట్టు తెలుస్తున్నది. నిందితుల్లో ప్రజాప్రతినిధితో పాటు మెజార్టీ వ్యక్తులు వేరే ఒక జాతీయ పార్టీకి చెందిన వారని తెలి సినప్పటికీ.. సదరు బడా నేత పోలీసులకు ఫోన్ చేసి, అరెస్టు చేయవ ద్దని చెప్పిన విషయం ఇప్పటికే వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో కబ్జా వ్యవహారం బయటికి రావడం, నిందితులు తప్పు చేశారని బడా నేతకు సమాచారం అందడం, పోలీసులు అరెస్టు కోసం ప్రయత్నిస్తుం డడం, ఈ తరుణంలో సదరు వ్యక్తులు పరారీ కావడంతో అరెస్టు చేయ వద్దని చెప్పిన ఆ బడా నేత ఇప్పుడు పోలీసులకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక షాక్‌లో ఉన్నట్టు తెలుస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karimnagar | పరారులో భూ మాఫియా!.. ‘నమస్తే’ కథనంతో వెలుగులోకి కోతిరాంపూర్ భూకబ్జా
Krishnaraj | తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం ..ప్రముఖ నేపథ్య గాయకుడు కృష్ణరాజ్ కన్నుమూత
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి వేడుకల్లో మార్పులు.. నవంబర్ 21న గ్రాండ్ రిసెప్షన్!
Hyderabad | హైదరాబాద్‌లో జలగలు.. అక్రమ బోర్లతో యథేచ్ఛగా ట్యాంకర్లతో నీటి వ్యాపారం!
Section 22A | కదలని 22ఏ ఫైళ్లు.. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే మూలుగుతున్న దరఖాస్తులు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

