Kamal Haasan In Oscar Academy | తమిళ అగ్ర నటుడు కమల్‌హాసన్ (Kamal Haasan)కు ఆస్కార్ అకాడమీలో చోటు దక్కిన విషయం తెలిసిందే. భారత్ నుంచి కమల్ హాసన్, ఆయుష్మాన్ ఖురానాలతో పాటు దర్శకురాలు పాయల్ కపాడియా, భారతీయ ఫ్యాషన్ డిజైనర్ మాక్సిమా బసు కూడా అకాడమీలో చోటు దక్కించుకున్నారు. ఈ విషయాన్ని ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (the Academy of Motion Picture Arts & Sciences). ఇటీవల ప్రకటించింది. అయితే కమల్ ఎంపిక అవ్వడంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) స్పందించారు.
సినీ పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే అకాడమీలో సభ్యుడిగా పద్మభూషణ్ కమల్‌హాసన్ ఎంపిక కావడం భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ విషయం. ఆరు దశాబ్దాలకు పైగా అద్భుతమైన నటనా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న కమల్ హాసన్ కేవలం ఒక నటుడిగానే కాకుండా, ఒక కథా రచయిత, దర్శకుడు, నిర్మాత, గాయకుడుగా సినిమాలోని ప్రతి విభాగంలోనూ తన అసాధారణ ప్రతిభను చాటుకున్నారు. ఆయన సినిమాటిక్ నైపుణ్యం, బహుముఖ ప్రజ్ఞ, దశాబ్దాల అనుభవం భారతీయ, అంతర్జాతీయ సినిమాపై చెరగని ముద్ర వేశాయి. రచయితగా, గాయకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా సినిమా నిర్మాణంలోని ప్రతి అంశంపై ఆయనకున్న పట్టు నిజంగా స్ఫూర్తిదాయకం. ఆయన కళకు నిజమైన మాస్టర్. ప్రపంచ సినిమాకు ఆయన చేస్తున్న విశేష సేవకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, మరెన్నో సంవత్సరాలు ఆయన సేవలు ప్రపంచ సినిమాకు అందాలని ఆకాంక్షిస్తున్నాం. అంటూ పవన్ కళ్యాణ్ రాసుకోచ్చారు.
It is a moment of immense pride to Indian film industry that Padma Bhushan Thiru @ikamalhaasan Avl has been selected as a member of the prestigious @TheAcademy Awards 2025 committee.
With a phenomenal acting career spanning six decades, Kamal Haasan garu is more than an actor.…
— Pawan Kalyan (@PawanKalyan) June 29, 2025