JD Chakravarthy | రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్‌ల కాంబినేషన్లో వచ్చిన ‘కల్కి 2898ఏడీ’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న ఈ చిత్ర సీక్వెల్‌కు సంబంధించి గత కొద్దిరోజులుగా ఒక ఆసక్తికర వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. టాలీవుడ్ సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి ఈ రెండో భాగంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతుంది.
అయితే తాజాగా తన సినిమా ‘గాయపడ్డ సింహం’ ప్రమోషన్లలో పాల్గొన్న ఆయన ఈ రూమర్లపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ‘కల్కి 2’లో తాను నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, ఇప్పటివరకు తాను ఎలాంటి షూటింగ్‌లోనూ పాల్గొనలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రచారాన్ని కేవలం సరదాగా ఎంజాయ్ చేశానని చెబుతూ, ఆ వార్తలకు జేడీ స్వస్తి పలికారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సీక్వెల్లో ప్రభాస్ భైరవ, కర్ణ పాత్రలతో పాటు మరో విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారని తెలుస్తోంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజాల పాత్రల నిడివి ఈసారి మరింత ఎక్కువగా ఉంటుందని సమాచారం.