Bandi Sai Bhageerath | కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ అంబర్‌పేట నియోజకవర్గం చే నంబర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌కు, ఆయన కుమారుడు భగీరథకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌తో పాటు బీఆర్ఎస్ నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ మైనర్ బాలికను లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటనలో పోక్సో చట్టం కింద కేసు నమోదు కావాల్సి ఉందని తెలిపారు. కానీ దానిని హనీ ట్రాప్‌గా మార్చి కేసును నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇందుకు రాష్ట్రంలో బీజేపీ-కాంగ్రెస్ ఒక్కటే అని వస్తున్న ఆరోపణలు నిజమవుతున్నాయని అన్నారు.
బండి సంజయ్ తన అహంకారాన్ని తగ్గించుకోవాలని హితవు పలికారు. ఈ ఘటనకు బాధ్యత వహించి ఆయన వెంటనే తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు. ప్రభుత్వం స్పందించి బండి సాయి భగీరథను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించాలని డిమాండ్ చేశారు. బాధిత బాలిక కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేంత వరకు ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన బండి సాయి భగీరథను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ అంబర్‌పేట చే నంబర్ చౌరస్తాలో బీఆర్ఎస్ రాస్తారోకో.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ అంబర్‌పేట నియోజకవర్గం చే నంబర్ చౌరస్తాలో బీఆర్ఎస్… pic.twitter.com/uNglNwjMvS
— BRS Party (@BRSparty) May 12, 2026