KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
KU Faculty Recruitment | కాంగ్రెస్ ప్రభుత్వంలో యూని వర్సిటీల్లో సరిపడా బోధించేవారు లేకపోవడంతో విద్య అందని ద్రాక్షలా మారుతున్నది. యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు చేపడుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
KU Faculty Recruitment | హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 23 : కాంగ్రెస్ ప్రభుత్వంలో యూని వర్సిటీల్లో సరిపడా బోధించేవారు లేకపోవడంతో విద్య అందని ద్రాక్షలా మారుతున్నది. యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు చేపడుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో అక్రమంగా నియమించిన వారిని ఆమోదించకపోవడం, మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వారికే పదోన్నతులు కల్పించడంపై విమర్శలు గుప్పుమంటున్నాయి.
రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆశావహుల్లో సంతోషం వెల్లివిరిస్తున్నది.
అయితే, రాష్ట్రంలో అతి పెద్ద రెండో విశ్వవిద్యాలయమై కేయూలో మాత్రం కేవలం 49 మాత్రమే సహాయ ఆచార్యుల పోస్టులు భర్తీ చేయడానికి అనుమతి ఇవ్వడం, కొన్ని విభాగాల్లో ఖాళీగా ఉన్నా ప్రకటించకపోవడం వారిలో ఒకింత నిరాశ కనబడుతున్నది. గతంలో డిసెంబర్ 31, 2010లో మొత్తం 61 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి 38 మందినే ఎంపిక చేశారు. ఇందులో ఇప్పుడు 28 మంది పనిచేస్తున్నారు. ఆ తర్వాత 21 డిసెంబర్ 2012లో కేయూ ఇంజినీరింగ్ కాలేజీ కోసం ఐదుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియా మకానికి నోటిఫికేషన్ జారీ చేసి నలు గురిని ఎంపిక చేసి భర్తీ చేశారు. వీరిలో ప్రస్తుతం ఒకరు రిటైర్ అయ్యారు. మిగతా ముగ్గురిలో ఒకరు ఇంగ్లిష్ విభాగంలో, మరో ఇద్దరు ఇంజినీరింగ్ కాలేజీలో పనిచేస్తున్నారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వర్సిటీలో నియా మకాల కోసం ఉమ్మడి బోర్డును ప్రవేశపెట్టాలని అసెంబ్లీలో చట్టం చేసి అనుమతి కోసం గవర్న ర్కు, అక్కడి నుంచి రాష్ట్రపతి కార్యాలయానికి పంపారు. ఇప్పటివరకు ఆ బిల్లుపై సందిగ్ధత నెల కొంది. ఇదిలా ఉండగా ప్రస్తుత ప్రభుత్వం ఏకంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ కోసం యూజీసీ నిబంధన లను పక్కనపెట్టి ఏకంగా జీవో నంబర్ 21ని విడు దల చేసింది. యూనివర్సిటీల విద్యార్థి సంఘాలు, పార్ట్ం, ఒప్పంద తదితర అధ్యాపకుల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో దాన్ని పక్కన బెట్టి మళ్లీ జీవో 1 టీ విడుదల చేశారు. దీని మీద పలు సంఘాల నుంచి అభ్యంతరాలు వెలువ డ్డాయి. ఈ జీవో రద్దు చేసి ఒప్పంద అధ్యాపకులను రెగ్యులర్ చేసిన తర్వాతనే కొత్తగా నియామకాలు జరపాలని ఆ సంఘం నిరసన తెలిపింది. జీవో 31 ద్వారా ప్రతిపాదించిన 50 మార్కుల అకడమిక్, పరిశోధన వెయిటేజీని మార్చే విధానం, 1:10 నిష్పత్తిలో అభ్యర్థుల షార్టిస్ట్ తయారు చేయడం, స్క్రూటినీ కమిటీలో నామినీగా రాష్ట్ర ఉన్నత విద్యామండలికి చేర్చడం, అలాగే విశ్వవి ద్యాలయాల చట్టబద్ధమైన నియామక కమిటీ కంటే ముందు మరో వ్యవస్థ ద్వారా అభ్యర్థుల అర్హత, మెరిట్ ను నిర్ణయించడం వంటి అంశాలు చర్చనీయంగా మారాయి. రాష్ట్రస్థాయి స్క్రూటినీ కమి టీ కేవలం ప్రాథమిక పరిశీలన చేసే సంస్థ గానే ఉంటుందా? లేక వాస్తవంగా అభ్యర్థుల ఎంపికను ప్రభావితం చేసే అధికారాన్ని కలిగి ఉంటుందా? అన్నది స్పష్టంగా తెలియాల్సి ఉంది.
నోటిఫికేషన్ రద్దు.. కోర్టు వివాదాలు
కేయూ పాలకమండలి 2012 నోటిఫికేషన్‌ను రద్దు చేయడం, వాటికి సంబంధించిన మరొక 2010 బ్యాచ్ కేసు న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్న పరిస్థితిలో కొత్త నోటిఫికే షన్ జారీ చేయవచ్చా? ఇంజినీరింగ్ కళాశాల ఖాళీలను మినహాయించడానికి కారణం ఏమిటి? 136 ఖాళీల ను 49కు తగ్గించడ మేంటి? రాష్ట్ర ప్రభుత్వం జీవో ద్వారా యూజీసీ నిబంధనలను మార్చగలదా? అన్న ప్రశ్నలకు సరైన సమాధానం లేదు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

