munugode by poll results | మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన కేఏ పాల్.. నోటాకు పోలైన ఓట్లతో పోటీ పడుతున్నారు. తొలి, రెండో రౌండ్లో కేఏ పాల్‌కు 34, 35 ఓట్లు పోల్ కాగా, నోటాకు 29, 53 ఓట్లు పోలయ్యాయి. కేఏ పాల్‌కు పోలైన ఓట్ల వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఉప ఎన్నిక ప్రచారంతో పాటు పోలింగ్ రోజున కేఏ పాల్ హంగామా సృష్టించిన సంగతి తెలిసిందే. గెలుపు నాదే అంటూ ఉరుకులు, పరుగులు పెట్టిన విషయం విదితమే.
మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు నాలుగు రౌండ్లు పూర్తయ్యాయి. చౌటుప్పల్ మండల పరిధిలోని నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 26443 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి 25729, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి 7380, బీఎస్పీ అభ్యర్థి ఆందోజు శంకర్‌కు 907 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా టీఆర్ఎస్ 714 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉంది.