రేపటి నుంచి గోవింద రాజస్వామి ఆలయంలో జ్యేష్టాభిషేకం
జ్యేష్టాభిషేకం | రుపతిలోని గోవింద రాజస్వామి ఆలయంలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు జ్యేష్టాభిషేకం జరుగనుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి ఆషాడ మాసంలో జ్యేష్టా నక్షత్రం నుంచి తిరుపతిలోని

తిరుమల : తిరుపతిలోని గోవింద రాజస్వామి ఆలయంలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు జ్యేష్టాభిషేకం జరుగనుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి ఆషాడ మాసంలో జ్యేష్టా నక్షత్రం నుంచి తిరుపతిలోని గోవింద రాజస్వామికి జ్యేష్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కరోనా మహమ్మారి వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఉత్సవాలు మూడు రోజులపాటు ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహించనున్నారు. తొలిరోజు 19న కవచాధివాసం, 20న కవచ ప్రతిష్ఠ, జూలై 21న కవచ సమర్పణ నిర్వహిస్తారు. ఈ మూడు రోజుల పాటు ఉదయం పాలు, పెరుగు, తేనె, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో శతకలశ స్నపనతిరుమంజనం జరుపనున్నారు. తర్వాత మహాశాంతి హోమం, సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత గోవింద రాజస్వామివారి ఉత్సవరులను ఆలయంలో విమాన ప్రాకారం చుట్టూ ఊరేగించనున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mrunal Takhur | ఇతరుల జీవితాలపై కామెంట్స్ చేయడానికి మీరెవరు.. మృణాల్ ఠాకూర్ సీరియస్
Ajinkya Shinde | సీజేపీ నిరసనల బాధ్యతలు అజింక్య షిండేకు.. ఆయన ఎవరంటే?
Shashi Tharoor | ఎమర్జెన్సీ కాదు.. ఇది ఎమర్ జెన్ జీ.. ఢిల్లీలో పోలీసుల దిగ్బంధనంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

