ట్రినిడాడ్ : స్వదేశంలో పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ పేసర్ జస్టిన్ గ్రీవ్స్ (5/27)రికార్డు ప్రదర్శనతో ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్‌ను గజగజ వణికించాడు. వరుసగా ఐదు ఓవర్లలో ఒక్క పరుగూ ఇవ్వకుండా 5 వికెట్లు పడగొట్టి పాక్ వెన్నువిరిచాడు. గ్రీవ్స్ పేస్ మ్యాజిక్‌తో తొలి ఇన్నింగ్స్ ఒక దశలో 62.5 ఓవర్లకు 244/3తో ఉన్న పాక్.. ఏడు ఓవర్ల వ్యవధిలోనే ఆరు వికెట్లు కోల్పోయి 267/9తో నిలిచింది.
64వ ఓవర్లో బంతినందుకున్న గ్రీవ్స్.. మొదట షాన్ మసూద్ (109)ను ఔట్ చేసి పాక్ పతనానికి శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత వరుస ఓవర్లలో అలి ఉస్మాన్, జమాల్, రిజ్వాన్, అబ్బాస్‌ను ఔట్ చేసి తన కెరీర్లో తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో వరుసగా ఐదు ఓవర్లలో ఒక్క పరుగూ ఇవ్వకుండా ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు.