IND vs SL : కొలంబో టెస్టులో భారత జట్టు భారీస్కోర్తో తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తొలిరోజే దేవ్‌దత్ పడిక్కల్(117) శతకంతో పటిష్టమైన పునాది వేయగా.. రెండో రోజు ధ్రువ్ జురెల్(115 నాటౌట్), రిషభ్ పంత్(63)లు శ్రీలంక బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. ఏడో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యంతో టీమిండియాకు భారీ స్కోరందించిందీ జంట. జురెల్ వంద పూర్తైన కాసేపటికే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు.
తొలి టెస్టులో విజయంతో జోరు మీదున్న భారత జట్టు కొలంబోలోనూ పటిష్ట స్థితిలో నిలిచింది. ఓవర్‌నైట్ స్కోర్ 300జ5తో రెండో రోజు ఆట ఆరంభించిన టీమిండియా.. ధ్రువ్ జురెల్(115 నాటౌట్) సెంచరీ, రిషభ్ పంత్(63) అర్ధ శతకంతో భారీ స్కోరందించారు. లంక బౌలర్లను విసిగెత్తించిన ఈ జోడీ.. శతక భాగస్వామ్యంతో విరుచుకుపడింది.
Innings Break!
Hundreds from Devdutt Padikkal & Dhruv Jurel and fifties from Rishabh Pant & Captain Shubman Gill! 👏👏
A solid show with the bat from #TeamIndia to post 503/9d on the board! 💪 💪
Scorecard ▶️ https://t.co/r9FgXSdsMf#SLvIND pic.twitter.com/HANxLa8iyx
— BCCI (@BCCI) August 24, 2026
తొలి సెషన్లో, ఆపై లంచ్‌కు ముందు ప్రత్యర్థి పేస్, స్పిన్ బౌలర్లపై పంత్ ఎదురుదాడికి దిగగా.. జురెల్ తన స్టయిల్లో దంచేశాడు. టీ బ్రేక్ అనంతరం.. వర్షంతో ఆట ఆలస్యంగా మొదలైనా.. జురెల్ టెస్టుల్లో రెండో సెంచరీ సాధించాడు. అతడి వంద కోసం ఎదురుచూసిన కోచ్ గౌతం గంభీర, కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. 503/9 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేశారు. లంక బౌలర్లలో ఫెర్నాండో నాలుగు వికెట్లు తీయగా.. జయసూర్య, నువాంత తలా రెండేసి వికెట్లు, లహిరు కుమార ఒక వికెట్‌తో రాణించారు.
లంక బౌలర్ల షార్ట్‌పిచ్ బంతులకు మణికట్టు గాయంతో తొలిరోజు రిటైర్డ్ హర్ట్ అయిన పంత్, జురెల్ రెండో రోజు హవా చూపించారు. క్రీజులో పడుతూ లేస్తూ తన స్టయిల్లో వీరంగం సృష్టించిన పంత్ 95మీటర్ల, 103 మీటర్ల దూరం సిక్సర్లతో అభిమానులను అలరించాడు. వీరిద్దరి దూకుడుతో లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 419 రన్స్ చేసింది. కానీ, భోజన విరామం తర్వాత మొదటి బంతికే పంత్ ఔటయ్యాడు.

అపై మానవ్ సుతార్(18) జతగా ఇన్నింగ్స్ నిర్మించిన జురెల్.. శతకానికి చేరువయ్యాడు. అసితా ఫెర్నాండో ఓవర్లో బౌండరీతో అతడు 95కి రాగా.. అప్పటికే అకాశం మబ్బుపట్టడంతో.. అంపైర్లు ముందుగానే టీ సెషన్ ప్రకటించారు. తిరిగి 4ఫ35 కి ఆట మొలవ్వగా.. సింగిల్‌తో టెస్టుల్లో రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు జురెల్. సిరాజ్ ఔటవ్వడం.. స్కోర్ ఐదొందలు దాటడంతో కెప్టెన్ గిల్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు.