
జస్టిస్ శంతనగౌడర్
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ మోహన్ ఎం శంతనగౌడర్కు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సోమవారం నివాళులర్పించారు. ఆయనను ‘సామాన్యుల న్యాయమూర్తి’గా అభివర్ణించారు. శంతనగౌడర్ మరణం సుప్రీంకోర్టుకు తీరని లోటని పేర్కొన్నారు. సోమవారం సుప్రీంకోర్టులో జరిగిన సంతాప కార్యక్రమంలో సీజేఐ రమణ మాట్లాడారు. శంతనగౌడర్ లాంటి సహచరుల మృతికి సంతాపం వ్యక్తం చే యాల్సి రావడం చాలా బాధాకరమన్నారు.